తగ్గిన బంగారం ధరలు, లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు లాభాలబాటలో రికార్డు స్థాయిలో పరుగుపెడుతుంటే.. మరో వైపు బంగారం ధర తిరోగమనంలో పయనిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1268డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది 10 వారాల కనిష్ట స్దాయి. ఇక ఎంసీక్స్‌లో బంగారం ధర 27,765లకు పడిపోయింది.
దీంతో బంగారంలో పెట్టుబడి పెట్టడం కంటే స్టాక్ మార్కెట్లలో మదుపు చేస్తే మంచి లాభాలు వస్తాయని మదుపుదారులు భావిస్తున్నారు. దీంతో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బంగారంలో పెట్టుబడి 67శాతానికి తగ్గిందని ప్రపంచ బంగారు మండలి తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కూడా లాభాలబాటలో పయనిస్తున్నాయి. అమెరికా ఆర్దిక వ్యవస్ద నుండి సానుకూల వార్తలు వస్తుండటంతో డాలర్ బలపడుతోంది. ఈ ప్రభావం బంగారంపై ప్రతికూలంగా పడుతోంది.

ఇరాక్, లిబియా, ఉక్రెయిన్‌లలో ఉద్రిక్త పరిస్దితులు నెలకొండటమే బంగారం ధర తగ్గడానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. కరెంట్ ఖాతా లోటు గణనీయంగా తగ్గడంతో పాటుగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆశించినదానికన్నా మెరుగైన వృద్ధి రేటు నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు వరదలాగా వచ్చిపడుతుండడంతో బిఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం మరో 151 పాయింట్లు పెరిగి తొలిసారిగా 27 వేల పాయింట్ల స్థాయిని దాటిపోయింది.
మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ నిఫ్టీ సైతం తొలిసారి 8.100 పాయింట్ల స్థాయిని తాకింది. వరసగా ఎనిమిదో రోజు లాభాల బాటలో సాగిన సెన్సెక్స్ తాజాగా చరిత్రలోనే మొట్టమొదటిసారి లావాదేవీల ప్రారంభంలో 27,082.85 పాయింట్ల రికార్డు స్థాయిని తాకింది.


Click it and Unblock the Notifications