ఎయిర్ ఏషియా 'ఫెస్టివ్ హాలిడే సేల్' ఎబ్రాడ్ రూ. 2599 మాత్రమే
హైదరాబాద్: ఇటీవల కాలంలో విమానయాన సంస్దలు ప్రయాణీకులకు వరుసపెట్టి ఆఫర్స్‌ని అందించిన విషయం తెలిసందే. ఈ ఆఫర్స్ అన్నీ కేవలం మన దేశంలోని ఒక నగరం నుండి మరోక నగరానికి మాత్రమే. ఐతే ఈ ఆఫర్ ఇప్పుడు విదేశాలకు పాకింది. చౌక విమానయానాన్ని అందించే ఎయిర్ ఏషియా ఈ ఆఫర్‌కి శ్రీకారం చుట్టింది.
'ఫెస్టివ్ హాలిడే సేల్' పేరిట కేవలం రూ. 2599లకే విదేశీయానానికి టిక్కెట్లు అందిస్తుంది. ఈ డిస్కౌంట్ టిక్కెట్ల అమ్మకాలు ఈ నెల ఒకటో తేదీ నుండి ఏడో తేదీ వరకు కొనసాగుతాయి. ఈ ఆఫర్ సెప్టెంబర్ రెండో తేదీ నుండి జనవరి 31 తేదీల మధ్య విదేశీ ప్రయాణాలకు వర్తిస్తుంది.

కొచ్చిన్ నుండి కౌలాలంపూర్ వెళ్లడానికి (అన్ని పన్నులు కలిపి) కేవలం రూ. 2599 చెల్లిస్తే సరిపోతుంది. అదే చెన్నై నుండి కౌలాలంపూర్ వెళ్లాలంటే రూ. 5699 చెల్లిస్తే సరిపోతుంది. అదే కౌలాలంపూర్‌కి బెంగుళూరు నుండి వెళ్లాలంటే మాత్రం రూ. 6299గా టికెట్ ధరను నిర్ణయించింది ఎయిర్ ఏషియా ఇండియా.
మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా బెర్హాద్, టాటా గ్రూప్, ఢిల్లీకి చెందిన పెట్టుబడి సంస్ద టెలెస్ట్రా ట్రేడ్ ప్లేస్ సంస్దలు మూడు కలిసి ఎయిర్ ఏషియా ఇండియాను ప్రారంభించాయి. జూన్ 12వ తేదీన సంస్దకు చెందిన తొలి విమానం బెంగుళూరు నుండి గోవాకు వెళ్లింది.


Click it and Unblock the Notifications


