మారథాన్: కెటిఆర్, రానా, యువత(పిక్చర్స్)

హైదరాబాద్: ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించటమే లక్ష్యంగా వరుసగా నాలుగో ఏడాది ఎయిర్‌టెల్‌ హైదరాబాద్‌ మారథాన్‌ ఆదివారం పరుగువీరులు, నగరవాసుల ఆనందోత్సాహాల నడుమ సాగింది. ఉత్సాహం ఉంటే వయసుతో సంబంధం ఏముంది అన్న రీతిలో నాలుగన్నరేళ్ల చిన్నారి నుంచి 83 సంవత్సరాల నవ యువకుల వరకూ ఈ మారథాన్‌ రేస్‌లో పాల్గొన్నారు.

5 కె రన్‌లో రాష్ట్ర ఐటి శాఖామంత్రి కె తారక రామారావు, సినీ నటులు రానా, సునీల్‌, సైబరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కూడా పాల్గొని నగరవాసులను ఉత్సాహ పరిచారు. అంతర్జాతీయంగా సుప్రసిద్ధులైన మారథాన్‌ కోచ్‌ బిల్‌ పియర్స్‌ ఈ రేస్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించటమే కాదు హాఫ్‌ మారథాన్‌లో పాల్గొన్నారు. అల్ట్రా మారథాన్‌ రన్నర్‌ అరుణ్‌ భరద్వాజ్‌ ఈ రేస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

దాదాపు10500 మంది పాల్గొన్న ఈ రేస్‌లో అధికశాతం మంది 5 కె రన్‌లో పాల్గొన్నారు. 90కు పైగా కార్పోరేట్‌ సంస్థల నుంచి ఉద్యోగులు పాల్గొంటే యునైటెడ్‌ హెల్త్‌ గ్రూప్‌కు చెందిన 800మందికి పైగా ఉద్యోగులు రేస్‌లో పాల్గొని కార్పోరేట్‌ ట్రోఫీ గెలుచుకున్నారు. ప్రతి సంవత్సరం ఈ రేస్‌లోపాల్గొంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వచ్చే సంవత్సరం మరింత పెద్దగా ఈ రేస్‌ జరుగటమే కాదు అంతర్జాతీయంగా అత్యంత ప్రాచుర్యం పొందిన రేస్‌గా హైదరాబాద్‌ మారథాన్‌ నిలువాలని కెటిఆర్‌ ఆకాంక్షించారు.

నెక్లెస్‌ రోడ్‌లో ఉదయం 5 గంటలకు ఫుల్‌ మారథాన్‌ రేస్‌ ప్రారంభమైతే కేవలం 2గంటల 24 నిమిషాల 57 సెకన్లల్లోనే 42.195 కిలోమీటర్ల దూరం పరుగెత్తి విజేతగా కరణ్‌ సింగ్‌ నిలిచారు. ఇక మహిళల విభాగంలో శ్యామాలీ సింగ్‌ 3 గంటల 23 నిమిషాల 40 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని మారథాన్‌ విజేతగా నిలిచారు. విజేతలిరువురికీ 60 వేల రూపాయల చొప్పున నగదు బహుమతిని అందజేశారు. హాఫ్‌ మారథాన్‌ విజేతలుగా బాబు, జ్యోతి నిలిచారు. వీరికి 40 వేల రూపాయల చొప్పున నగదు బహుమతి అందజేశారు.

మారథాన్

మారథాన్

ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించటమే లక్ష్యంగా వరుసగా నాలుగో ఏడాది ఎయిర్‌టెల్‌ హైదరాబాద్‌ మారథాన్‌ ఆదివారం పరుగువీరులు, నగరవాసుల ఆనందోత్సాహాల నడుమ సాగింది.

మారథాన్

మారథాన్

ఉత్సాహం ఉంటే వయసుతో సంబంధం ఏముంది అన్న రీతిలో నాలుగన్నరేళ్ల చిన్నారి నుంచి 83 సంవత్సరాల నవ యువకుల వరకూ ఈ మారథాన్‌ రేస్‌లో పాల్గొన్నారు.

మారథాన్

మారథాన్

నెక్లెస్‌ రోడ్‌లో ఉదయం 5 గంటలకు ఫుల్‌ మారథాన్‌ రేస్‌ ప్రారంభమైతే కేవలం 2గంటల 24 నిమిషాల 57 సెకన్లల్లోనే 42.195 కిలోమీటర్ల దూరం పరుగెత్తి విజేతగా కరణ్‌ సింగ్‌ నిలిచారు.

మారథాన్

మారథాన్

ఇక మహిళల విభాగంలో శ్యామాలీ సింగ్‌ 3 గంటల 23 నిమిషాల 40 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని మారథాన్‌ విజేతగా నిలిచారు.

మారథాన్

మారథాన్

విజేతలిరువురికీ 60 వేల రూపాయల చొప్పున నగదు బహుమతిని అందజేశారు.

మారథాన్

మారథాన్

హాఫ్‌ మారథాన్‌ విజేతలుగా బాబు, జ్యోతి నిలిచారు. వీరికి 40 వేల రూపాయల చొప్పున నగదు బహుమతి అందజేశారు.

మారథాన్

మారథాన్

దాదాపు10500 మంది పాల్గొన్న ఈ రేస్‌లో అధికశాతం మంది 5 కె రన్‌లో పాల్గొన్నారు.

మారథాన్

మారథాన్

90కు పైగా కార్పోరేట్‌ సంస్థల నుంచి ఉద్యోగులు పాల్గొంటే యునైటెడ్‌ హెల్త్‌ గ్రూప్‌కు చెందిన 800మందికి పైగా ఉద్యోగులు రేస్‌లో పాల్గొని కార్పోరేట్‌ ట్రోఫీ గెలుచుకున్నారు.

మారథాన్

మారథాన్

మారథాన్‌లో ప్రతి సంవత్సరం ఈ రేస్‌లోపాల్గొంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

మారథాన్

మారథాన్

ఉత్సాహం ఉంటే వయసుతో సంబంధం ఏముంది అన్న రీతిలో నాలుగన్నరేళ్ల చిన్నారి నుంచి 83 సంవత్సరాల నవ యువకుల వరకూ ఈ మారథాన్‌ రేస్‌లో పాల్గొన్నారు.

మారథాన్

మారథాన్

నిరుడులాగే ఈ సారి కూడా మేజర్‌ డి.పి సింగ్‌ సారథ్యంలో ఛాలెంజింగ్‌ ఒన్స్‌ రేస్‌లో పాల్గొన్నారు.

మారథాన్

మారథాన్

ఈసారి దక్కన్‌ రీహెబ్‌ నుంచి 40 మందికిపైగా వికలాంగులు రేస్‌లో పాల్గొనటం విశేషం.

మారథాన్

మారథాన్

5 కె రన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఈ బ్లేడ్‌ రన్నర్స్‌ ఈ రేస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మారథాన్

మారథాన్

వీరిలో అధికశాతం మంది స్పోర్ట్స్‌మెన్‌లే ఉన్నారు. అర్జున అవార్డీ, రెండు కాళ్లు కోల్పోయినా మొక్కవోని స్థైర్యంతో 5కె కిలోమీటర్ల నడక మరో 5 కిలోమీటర్ల పరుగుతో స్ఫూర్తిగా నిలిచారు మాదాసు శ్రీనివాసరావు.

మారథాన్

మారథాన్

5 కె రన్‌లో రాష్ట్ర ఐటి శాఖామంత్రి కె తారక రామారావు, ఆయన కూతురు అలేఖ్య, సినీ నటులు రానా, సునీల్‌, సైబరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కూడా పాల్గొని నగరవాసులను ఉత్సాహ పరిచారు.

మారథాన్

మారథాన్

వచ్చే సంవత్సరం మరింత పెద్దగా ఈ రేస్‌ జరుగటమే కాదు అంతర్జాతీయంగా అత్యంత ప్రాచుర్యం పొందిన రేస్‌గా హైదరాబాద్‌ మారథాన్‌ నిలువాలని కెటిఆర్‌ ఆకాంక్షించారు.

మారథాన్

మారథాన్

అంతర్జాతీయంగా సుప్రసిద్ధులైన మారథాన్‌ కోచ్‌ బిల్‌ పియర్స్‌ ఈ రేస్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించటమే కాదు హాఫ్‌ మారథాన్‌లో పాల్గొన్నారు. అల్ట్రా మారథాన్‌ రన్నర్‌ అరుణ్‌ భరద్వాజ్‌ ఈ రేస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మారథాన్

మారథాన్

శ్రీనివాసరావుతో పాటుగా వీల్‌ ఛైర్‌ బాడ్మింటన్‌ ప్లేయర్‌ రామాంజనేయులు, మొహ్మద్‌ ఫరూఖ్‌, అథ్లెటిక్స్‌లో శిక్షణ తీసుకుంటున్న చిన్నారి కౌషిక్‌ (పుట్టుకతోనే ఓ కాలు కోల్పోయారు)తదితరులు కూడా పాల్గొన్నారు.

మారథాన్

మారథాన్

బోన్‌ క్యాన్సర్‌ వచ్చి ఓ కాలును కోల్పోయిన రాజమండ్రికి చెందిన సతీష్‌ తనలో ఆత్మవిశ్వాసాన్ని ఈ రేస్‌ నిలిపిందన్నారు.

మారథాన్

మారథాన్

నిరుడు కాలు కోల్పోతే ఈ సంవత్సరం రేస్‌లో పాల్గొన్నానని తెలిపారు. ఓ రైలు ప్రమాదంలో రెండు కాళ్లూ కోల్పోయిన ప్రతీక్‌ భండారీ అయితే కృత్రిమ కాళ్లు పెట్టుకున్న తరువాత తాను పాల్గొన్న తొలి రన్నింగ్‌ రేస్‌ ఇదే అని చెప్పారు.

మారథాన్

మారథాన్

90కు పైగా కార్పోరేట్‌ సంస్థల నుంచి ఉద్యోగులు పాల్గొంటే యునైటెడ్‌ హెల్త్‌ గ్రూప్‌కు చెందిన 800మందికి పైగా ఉద్యోగులు రేస్‌లో పాల్గొని కార్పోరేట్‌ ట్రోఫీ గెలుచుకున్నారు.

మారథాన్

మారథాన్

ఇక మహిళల విభాగంలో శ్యామాలీ సింగ్‌ 3 గంటల 23 నిమిషాల 40 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని మారథాన్‌ విజేతగా నిలిచారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+