హైదరాబాద్: స్టార్టప్‌లకు పెట్టుబడి కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందిన తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల్లో విశేషంగా కృషి చేసిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఒక్కతాటిపైకి తేవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ‘ఆగస్టు ఫెస్ట్-2014' ఆగస్టు 30 నుంచి 31 వరకు రెండు రోజులపాటు ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐబిఎస్)లో జరుగనుందని చెప్పారు.
ఇప్పటి వరకు మనదేశంలో జరిగిన సదస్సులలో ఇదే అతిపెద్ద స్టార్టప్ పండుగని చెప్పారు. యువ పారిశ్రామికవేత్తలకు తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఈ సదస్సుకు సుమారు 1500మంది ఔత్సాహిక పారిశ్రామిక వత్తేలు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. సరికొత్త ఆలోచనలు ఉండి నిధులు లేక సతమతమవుతున్న వారికి ఈ వేదిక అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తుందన్నారు.
నిరుడు నిర్వహించిన ఈ సదస్సుకు దేశ వ్యాప్తంగా 400 నుంచి 500మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పాల్గొనగా.. ఈసారి ఆ సంఖ్య మూడింతలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రెండో ఎడిషన్ కొత్త ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎంతో లాభసాటిగా ఉండనుందని ఈట్ స్లిప్ డ్రింక్(ఈఎస్‌డి) సహ వ్యవస్థాపకుడు సురేష్ తెలిపారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ఇంక్యూబేటర్ ఈ ఏడాది చివర్లోగా లేదా వచ్చే ఏడాది మొదట్లో అందుబాటులోకి వస్తుందని కెటిఆర్ చెప్పారు. మొదటి దశలో 80వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్‌లో సుమారు 400 స్టార్టప్ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి వీలుంటుందని తెలిపారు.

కెటిఆర్
స్టార్టప్‌లకు పెట్టుబడి కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందిన తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు.

కెటిఆర్
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల్లో విశేషంగా కృషి చేసిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఒక్కతాటిపైకి తేవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ‘ఆగస్టు ఫెస్ట్-2014' ఆగస్టు 30 నుంచి 31 వరకు రెండు రోజులపాటు ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐబిఎస్)లో జరుగనుందని చెప్పారు.

కెటిఆర్
ఇప్పటి వరకు మనదేశంలో జరిగిన సదస్సులలో ఇదే అతిపెద్ద స్టార్టప్ పండుగని చెప్పారు. యువ పారిశ్రామికవేత్తలకు తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.

కెటిఆర్
ఈ సదస్సుకు సుమారు 1500మంది ఔత్సాహిక పారిశ్రామిక వత్తేలు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ఇంక్యూబేటర్ ఈ ఏడాది చివర్లోగా లేదా వచ్చే ఏడాది మొదట్లో అందుబాటులోకి వస్తుందని కెటిఆర్ చెప్పారు.
More From GoodReturns

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

New Rules: తెలంగాణ డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్! ఇకపై అది ఉంటేనే లైసెన్స్!

తెలంగాణ నుంచి తిరుపతికి వేగవంతమైన కనెక్టివిటీ.. నకిరేకల్ - ఏర్పేడు NH-565 పూర్తిగా అందుబాటులోకి..

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..



Click it and Unblock the Notifications