For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడాదిలోపే రియల్ భూం: హరీశ్ రావు(పిక్చర్స్)

|

హైదరాబాద్: నగర పరిసర ప్రాంతాల్లో వచ్చే ఏడాది లోపు స్థిరాస్థి భూం రానుందని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం రాత్రి నగరంలోని మారియట్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంపొందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వంలో కొత్త ప్రమాణాలతో రియల్ ఎస్టేట్ వ్యవస్థ అభివృద్ధి చెందాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని ప్రమాణాలతో, ఆధునాతన పరికరాలతో తొలి ప్రాపర్టీ షోను నిర్వహించాలని సూచించారు. 2015లోపు మళ్లీ నగరంలో రియల్ భూం వస్తుందని పేర్కొన్నారు. దేశవిదేశాల వ్యాపారులు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నారని తెలిపారు. వారికి సింగిల్ విండో విధానంలో పారదర్శకంగా అనుమతులు ఇస్తామని చెప్పారు.

పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి పన్నుల రాయితీ ఉండబోతోందని వెల్లడించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు జిహెచ్ఎంసిని రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా విభజించేందుకు పరిశీలనలు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ముంబై, ఢిల్లీ మహా నగరాలను పరిశీలించి వచ్చేందుకు బృందాలు పంపించామని చెప్పారు.

వచ్చే ఏడాది చివరి నాటికి కృష్ణ మూడో దశ పూర్తవుతుందని, వచ్చే ఏడాది మే నాటికి గోదావరి పనులు పూర్తవుతాయని.. దీంతో భవిష్యత్తులో హైదరాబాద్ మహానగరానికి 24 గంటలు మంచినీళ్లు అందించగలుగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సపురం, బాల్కొండ ఎమ్మెల్యేలు మధన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దశరథ రెడ్డి, సభ్యులు చలపతిరావు, సునీల్ రెడ్డి, రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

హరీశ్ రావు

హరీశ్ రావు

నగర పరిసర ప్రాంతాల్లో వచ్చే ఏడాది లోపు స్థిరాస్థి భూం రానుందని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.

హరీశ్ రావు

హరీశ్ రావు

మంగళవారం రాత్రి నగరంలోని మారియట్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) లోగోను ఆయన ఆవిష్కరించారు.

హరీశ్ రావు

హరీశ్ రావు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంపొందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

హరీశ్ రావు

హరీశ్ రావు

కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వంలో కొత్త ప్రమాణాలతో రియల్ ఎస్టేట్ వ్యవస్థ అభివృద్ధి చెందాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని ప్రమాణాలతో, ఆధునాతన పరికరాలతో తొలి ప్రాపర్టీ షోను నిర్వహించాలని సూచించారు.

హరీశ్ రావు

హరీశ్ రావు

2015లోపు మళ్లీ నగరంలో రియల్ భూం వస్తుందని పేర్కొన్నారు. దేశవిదేశాల వ్యాపారులు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నారని తెలిపారు. వారికి సింగిల్ విండో విధానంలో పారదర్శకంగా అనుమతులు ఇస్తామని చెప్పారు.

English summary

ఏడాదిలోపే రియల్ భూం: హరీశ్ రావు(పిక్చర్స్) | New industrial policy soon, says Harish Rao

Irrigation Minister Harish Rao, who was the chief guest at an event held by the Telangana Real Estate Developers Association (TREDA) on Tuesday evening, said that in the next few days the new industrial policy will be introduced.
Story first published: Wednesday, August 13, 2014, 11:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X