టిలో పెట్టుబడులకు ఢోకా లేదు: ఈటెల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలని, అలా పెట్టుబడులను ప్రోత్సహించాలంటే కంపెనీ సెక్రటరీల సహకారం ఈ నూతన రాష్ట్రానికి అవసరమని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ర్టంలో పెట్టుబడులకు ఢోకా లేదని చెప్పారు. ‘ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా' రెండు రోజుల ప్రాంతీయ సమావేశం ఆదివారం ముగిసింది.
ఈ సందర్భంగా జరిగిన హైదరాబాద్ చాప్టర్ 40వ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రసంగించారు. కంపెనీ యజమానులకు కంపెనీ సెక్రటరీలే దిక్సూచీలని, కంపెనీ సెక్రటరీల మీదే ఈ రాష్ర్ట భవిష్యత్ ఆధారపడి ఉందని అన్నారు. గత రెండు నెలల్లో రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఉందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అన్నారు.

రాష్ర్ట విభజన తర్వాత, తామెక్కడున్నామో తెలిస్తే తప్ప బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యం కాదని, అందుకే 19వ తేదీన సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామన్నారు. దీని నిర్వహణ వెనుక కొందరు ఊహిస్తున్నట్లుగా మరే ఇతర కారణాలు లేవని చెప్పారు. ఈ సర్వే కార్యక్రమంలో అంతా పాల్గొనాలని కోరారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్థ సభ్యులకు ఈటెల రాజేందర్ శుభాకాంక్షలు తెలిపారు.
కంపెనీ సెక్రటరీ కోర్సులలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, పతకాలు బహూకరించారు. కంపెనీ సెక్రటరీలుగా ఉపాధి అవకాశాలు బాగా ఉంటాయని హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు వాసుదేవరావు దేవకి తెలిపారు. ప్రభుత్వ కార్పోరేషన్లకు కంపెనీ సెక్రటరీలను నియమించాల్సిందిగా ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను సంస్థ కోశాధికారి ఏవి రావు, సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు సుధీర్‌బాబు కోరారు.


Click it and Unblock the Notifications