తెలంగాణకు ప్లాస్టిక్ పార్క్: కేంద్రమంత్రి అనంత్
హైదరాబాద్: దేశంలోని నాలుగు నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్లాస్టిక్ పార్కును మంజూరు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్లాస్టిక్ ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల్లో 8వేల ప్లాస్టిక్ యూనిట్లు ఉన్నాయని, యేటా రూ. 2,500 కోట్ల టర్నోవర్ జరుగుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

అనంత్ కుమార్
శుక్రవారం హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్లాస్టిక్ ప్రదర్శనను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ ప్రారంభించారు.

అనంత్ కుమార్
దేశంలోని నాలుగు నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్లాస్టిక్ పార్కును మంజూరు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని ఆయన తెలిపారు.

అనంత్ కుమార్
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల్లో 8వేల ప్లాస్టిక్ యూనిట్లు ఉన్నాయని, యేటా రూ. 2,500 కోట్ల టర్నోవర్ జరుగుతోందని చెప్పారు.

అనంత్ కుమార్
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

అనంత్ కుమార్
మెదక్ జిల్లా రుద్రారంలో ప్లాస్టిక్ ఎడ్యుకేషన్ కోసం దాదాపు 20 ఎకరాల స్థలంలో సుమారు రూ. 50కోట్ల వ్యయంతో 5వేల మంది విద్యార్థులకు వసతి కల్పించేలా క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు అనంత్ కుమార్ తెలిపారు.

అనంత్ కుమార్
కేంద్ర ప్రభుత్వం త్వరలోనే దేశవ్యాప్త ఎరువుల పాలసీని ప్రవేశపెట్టనుందని ఆయన చెప్పారు. దీని కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి అనంత్ కుమార్ వెల్లడించారు.

Click it and Unblock the Notifications