ఒరీస్ వాచీ ఆవిష్కరించిన సోనూసూద్(పిక్చర్స్)
హైదరాబాద్: తనకు వాచీలంటే చాలా ఇష్టమని, టెక్నికల్ వాచీలంటే మరీ ఇష్టమని చెప్పాడు సినీ నటుడు సోనూ సూద్. నగరంలోని బంజారాహిల్స్‌లోని కమల్‌వాచ్ కంపెనీలో ఒరీస్ ఆక్విస్ డెప్త్ గేజ్ వాచీ కలెక్షన్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రొఫెషనల్స్ కోసం చేసిన వాచీలంటే తనకు ఇష్టమని చెప్పారు.
షారూక్ ఖాన్, అభిషేక్ బచ్చన్ లాంటి స్టార్లతో కలిసి తాను నటించిన చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్' విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపారు. తెలుగులో తనకు చాలా మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పిన ఆయన, ఇక్కడి వారు తనను ఎంతగానో ఆదరిస్తారని చెప్పారు.
ఒరీస్ జనరల్ మేనేజర్ సంజయ్ మిశ్రా మాట్లాడుతూ.. ఒరీస్ ఇండియాలో 18 నెలల క్రితం ఆవిష్కరించబడిందని తెలిపారు. తాము ఈత గాళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రొఫెషనల్ వాచీ ‘ఒరీస్ ఆక్విస్ డెప్ట్ గేజ్' విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రూ. 2 లక్షల రూపాయలకు పైగా ధరల్లో ఈ శ్రేణి వాచీలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో కెడబ్ల్యూసి ప్రతినిధి వేణుగోపాల్ పాల్గొన్నారు.

సోనూసూద్
తనకు వాచీలంటే చాలా ఇష్టమని, టెక్నికల్ వాచీలంటే మరీ ఇష్టమని చెప్పాడు సినీ నటుడు సోనూ సూద్.

సోనూసూద్
నగరంలోని బంజారాహిల్స్‌లోని కమల్‌వాచ్ కంపెనీలో ఒరీస్ ఆక్విస్ డెప్త్ గేజ్ వాచీ కలెక్షన్‌ను ఆయన ఆవిష్కరించారు.

సోనూసూద్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రొఫెషనల్స్ కోసం చేసిన వాచీలంటే తనకు ఇష్టమని చెప్పారు.

సోనూసూద్
ఎప్పటిలాగే ఈ రాఖీ పండుగను కూడా వేడుకగా చేసుకోబోతున్నట్లు తెలిపారు. తన సోదరి ఒకరు అమెరికాలో ఉంటుండగా, మరొకరు మన దేశంలోనే ఉంటున్నారని చెప్పారు. ఇద్దరితోనూ ఆ రోజు రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటామని చెప్పారు.


Click it and Unblock the Notifications