హైదరాబాద్: పెట్టుబడులు వెల్లువెత్తేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా సన్‌రైజ్ పేరుతో కొత్త పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించేందుకు అధికారులకు కసరత్తులు చేయాలని ఆదేశించారు. బుధవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో కొత్త పారిశ్రామిక విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే విధంగా సరళీకృతమైన విధానాలను రూపొందించాలనీ, స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచే ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేస్తామని ప్రకటించారు. విశాఖ పారిశ్రామికవాడలో పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా చేసేందుకు ఒక ముఖ్య కార్యనిర్వహణాధికారిని నియమిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.
సెజ్‌లు, ఇండస్ట్రియల్ పార్కులకు ప్రత్యేకంగా సిఈఓలను నియమిస్తామని చెప్పారు. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జరిగిన పారిశ్రామిక ప్రగతిని అధ్యయనం చేసి సింగిల్ విండో క్లియరెన్సు ముసాయిదాను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి సింగిల్ విండో దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ఆవిష్కరిస్తామని చంద్రబాబు చెప్పారు. దరఖాస్తులు తీసుకున్న పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక గుర్తింపు కార్డును కేటాయించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. దీనివల్ల పారిశ్రామికవేత్తలు చేసుకున్న దరఖాస్తులు ఎక్కడ పెండింగ్‌లో ఉన్నాయో తెలిసిపోతుందని అన్నారు. అంతేగాక అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న భారీ పరిశ్రమల అనుమతులన్నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్‌లను ఏర్పాటు చేయాలని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్‌వి ప్రసాద్‌కు చంద్రబాబు సూచించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యదర్శి జి సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కమిషనర్ రజత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు సమీక్ష
పెట్టుబడులు వెల్లువెత్తేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా సన్‌రైజ్ పేరుతో కొత్త పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించేందుకు అధికారులకు కసరత్తులు చేయాలని ఆదేశించారు.

చంద్రబాబు సమీక్ష
బుధవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో కొత్త పారిశ్రామిక విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

బ్రెజిల్ ప్రతినిధుల భేటీ
పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే విధంగా సరళీకృతమైన విధానాలను రూపొందించాలనీ, స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.

బ్రెజిల్ ప్రతినిధుల భేటీ
సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచే ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేస్తామని ప్రకటించారు.

బ్రెజిల్ ప్రతినిధుల భేటీ
విశాఖ పారిశ్రామికవాడలో పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా చేసేందుకు ఒక ముఖ్య కార్యనిర్వహణాధికారిని నియమిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.


Click it and Unblock the Notifications