సుబ్రతా రాయ్‌కి జైలులో ‘ప్రత్యేక’ దర్బారు

Sahara chief Subrata Roy shifted to conference room of Tihar Jail
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు అనుమతి నేపథ్యంలో సహారా సిబ్బంది సహా పలువురు సందర్శకులు సహారా గ్రూప్ అధిపతి సుబ్రతా రాయ్‌ని తీహార్ జైలులోని ప్రత్యేక సమావేశ మందిరంలో కలిశారు. బెయిల్ కోసం రూ. 10,000 కోట్లు సమీకరించేందుకు విదేశాల్లో ఉన్న హోటళ్లను విక్రయించేందుకు సుబ్రతా రాయ్‌కి సుప్రీం కోర్టు అనుమతిచ్చిన విషయం తెలిసిందే.

మంగళవారం ఉదయం ఆయనను పటిష్ఠ భద్రత మధ్య ప్రత్యేక జైలుకు తరలించారు. ఇదే జైలులో ఉన్న సహారా డైరెక్టర్లు అశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దూబేలూ ఆయనతోపాటే ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మంగళవారం రోజున పలువురు రాయ్‌ని కలవడానికి వచ్చారని, అయితే అందులో కొనుగోలుదార్లు లేదా విక్రయ మధ్యవర్తులు ఉన్నారో లేదోనని తెలిపాయి.

రాయ్‌కి సంబంధించిన ఒక స్టెనో, సెక్రటరీ సహాయకులు, ఒక సాంకేతిక సహాయకులనూ అనుమతించారు. వీరు అన్ని పనిదినాల్లో ఉదయం 6గంటల నుంచి రాత్రి 8దాకా ఆయనకు సహాయం చేయవచ్చు. సమావేశ మందిరంలో జరిగే అన్ని సమావేశాలూ సిసిటీవీ కెమెరాల మధ్యే జరగనున్నాయి.

సుప్రీంకోర్టు అనుమతచ్చిన ఈ పది రోజులూ సుబ్రతా రాయ్‌కి జైలు ఆహారమే ఇస్తారు. అయితే ఆయనను కలుసుకోవడానికి వచ్చే వారితోపాటు ఆయనకు కూడా క్యాంటీన్ ఆహారం తీసుకునే అనుమతి ఉంది. ఇంతకుముందులాగే అన్ని జైలు నిబంధనలూ ఆయనకు వర్తిస్తాయి. మార్చి 4 నుంచి సుబ్రతా రాయ్ తీహార్ జైలు ఉంటున్న విషయం తెలిసిందే.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+