రాష్ట్ర మార్కెట్లోకి హోండా మొబిలియో(పిక్చర్స్)
హైదరాబాద్: హోండా కార్స్ ఇండియా హైదరాబాద్ మార్కెట్లోకి బహుళ ప్రయోజన వాహనం(ఎంపివి) మొబిలియోను విడుదల చేసింది. కంపెనీ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్(మార్కెటింగ్, అమ్మకాలు) షిగెరు యమజుకీ కొత్త వాహనం మొబిలియోను సోమవారం మార్కెట్లోకి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని తాము మొబిలియోను రూపొందించామని, కుటుంబంలోని సభ్యులందరూ కూర్చుని ప్రయాణించడానికి ఇది వీలుగా ఉంటుందని వివరించారు. మొబిలియోను ప్రవేశపెట్టడం ద్వారా ఎంపివి విభాగంలోకి కంపెనీ అడుగుపెట్టినట్లయిందని యమజుకి తెలిపారు.
హైదరాబాద్‌లో మొబిలియో పెట్రోల్ వాహనం ధర రూ. 6.80 లక్షల నుంచి రూ. 9.06 లక్షలు(ఎక్స్ ఫోరూం ధర) ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. డీజిల్ వాహనం ధర రూ. 8.24 లక్షల నుంచి 10.18 లక్షల మధ్య ఉంటుందని పేర్కొన్నాయి. మొబిలియో ఆర్ఎస్ ధర రూ. 11,30,500గా నిర్ణయించినట్లె వెల్లడించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే 650 వాహనాలకు ప్రీ బుకింగ్‌లు అయినట్లు తెలిపాయి.

హోండా మొబిలియో
హోండా కార్స్ ఇండియా హైదరాబాద్ మార్కెట్లోకి బహుళ ప్రయోజన వాహనం(ఎంపివి) మొబిలియోను విడుదల చేసింది.

హోండా మొబిలియో
కంపెనీ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్(మార్కెటింగ్, అమ్మకాలు) షిగెరు యమజుకీ కొత్త వాహనం మొబిలియోను సోమవారం మార్కెట్లోకి విడుదల చేశారు.

హోండా మొబిలియో
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ కుటుంబాలను పరిశీలించి తాము మొబిలియోను రూపొందించామని, కుటుంబంలోని సభ్యులందరూ కూర్చుని ప్రయాణించడానికి ఇది వీలుగా ఉంటుందని వివరించారు.

హోండా మొబిలియో
మొబిలియోను ప్రవేశపెట్టడం ద్వారా ఎంపివి విభాగంలోకి తమ కంపెనీ అడుగుపెట్టినట్లయిందని యమజుకి తెలిపారు.


Click it and Unblock the Notifications