హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ వెలుపల కొత్తగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా (అసోచామ్) సూచించింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, రాజధాని మధ్యన ఉన్న అంతరాలను పూడ్చాలంటే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని కోరింది.
గురువారం ‘తెలంగాణలో వాస్తవిక వృద్ధికి అవకాశాలు(రియలైజింగ్ గ్రోత్ పొటెన్షియల్ ఆఫ్ తెలంగాణ)' అనే పేరుతో రూపొందించిన నివేదికను అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్, సదరన్ రీజినల్ కౌన్సిల్ చైర్మన్ రవీంద్ర సన్నారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా రావత్ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవాలంటే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని, దీని ద్వారా పెద్ద ఎత్తున వ్యయాలు తగ్గే అవకాశం ఉందని అన్నారు.

సరళీకృతమైన విధానాల అమలుతో పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులను ఆకట్టుకోవచ్చని ఆ దిశగా ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని సూచించారు. అంతేకాకుండా ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అసోచాం రూపొందించిన నివేదికను ఇప్పటికే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, సంబంధిత శాఖలకు అందజేసినట్లు రావత్ తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 3,555 కోట్ల రూపాయల మిగులు ఉండనుందని అసోచామ్ నివేదిక పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రుణ భారం 1.45 లక్షల కోట్ల రూపాయలుండగా రాష్ట్ర విభజన అనంతరం జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై 61 వేల కోట్ల రూపాయల రుణ భారం పడిందని తెలిపింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలంటే ప్రభుత్వం పెద్ద ఎత్తున వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది.
జూన్ చివరి నాటికి తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న పెట్టుబడుల మొత్తం 3.3 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని డిఎస్ రావత్ అన్నారు. ఇందులో రియల్ ఎస్టేట్ రంగం వాటా 28 శాతం, సర్వీసుల వాటా (ఫైనాన్షియల్ రంగం మినహాయించి) 23 శాతం, ఎలకి్ట్రసిటీ 19 శాతం, నీటిపారుదల 16.5 శాతం, ఉత్పత్తుల రంగం 12 శాతంగా ఉండగా 1 శాతం పె ట్టుబడులు మైనింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అయితే ప్ర స్తుతం ఎన్ని ప్రాజెక్టుల్లో కార్యకలాపాలు సాగుతున్నాయనేది మాత్రం అసోచామ్ నివేదిక వెల్లడించలేదు.
కాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రైవేట్ పెట్టుబడుల వాటా 59 శాతంగా ఉన్నాయని తెలిపింది. అయితే దాదాపు 30 శాతం పెట్టుబడులు మాత్రం భూసేకరణ, క్లియరెన్సులు రాకపోవటం వంటి కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నివేదిక పే ర్కొంది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టుకునేందుకు గాను డిసెంబర్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో పెట్టుబడిదారుల సదస్సును నిర్వహించనున్నట్లు డిఎస్ రావత్ వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుదుత్పత్తిని మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అసోచామ్ నివేదిక కోరింది. థర్మల్ విద్యుత్‌తో పాటు సౌర విద్యుత్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని సూచించింది.
More From GoodReturns

తెలంగాణ నుంచి తిరుపతికి వేగవంతమైన కనెక్టివిటీ.. నకిరేకల్ - ఏర్పేడు NH-565 పూర్తిగా అందుబాటులోకి..

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

ఇందిరమ్మ ఇళ్లుపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏప్రిల్‌లో రెండో విడత కార్యక్రమం..

Hyderabad: రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఛాన్స్? బడ్జెట్ తర్వాత మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications