న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 18.5 శాతం పెరిగింది. 2012-13లో 5,27,047 కోట్ల రూపాయలు (96.79 బిలియన్ డాలర్లు)గా ఉండగా, 2013-14లో 6,24,757 కోట్ల రూపాయలు (103.27 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. దీంతో కేవలం ఏడాది వ్యవధిలో దాదాపు లక్ష కోట్ల రూపాయల మేర టాటా గ్రూప్‌లోని సంస్థల ఆదాయం పెరిగినట్లైంది.
ఏడు వ్యాపార విభాగాల్లో విస్తరించిన టాటా గ్రూప్‌లో 100కుపైగా సంస్థలున్నాయి. దేశ, విదేశాల్లో విస్తరించిన టాటా గ్రూప్.. దేశీయంగానేగాక అంతర్జాతీయంగా కూడా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. 2013-14లో అంతర్జాతీయంగా 4,19,860 కోట్ల రూపాయల ఆదాయాన్ని టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. 2012-13లో 3,30,530 కోట్ల రూపాయల ఆదాయంతోనే సరిపెట్టుకుంది.
ఆరు ఖండాల్లోని 100కుపైగా దేశాల్లో టాటా గ్రూప్ కార్యకలాపాలు సాగుతుండగా, 150కిపైగా దేశాలకు టాటా గ్రూప్ ఉత్పత్తులు, సేవలు ఎగుమతి అవుతున్నాయి. ఇక టాటా గ్రూప్ నికర విదేశీ మారకద్రవ్యం ఆర్జన గత ఆర్థిక సంవత్సరం ఏకంగా 93.5 శాతం పెరిగింది. 2013-14లో 32,129 కోట్ల రూపాయలకు చేరింది. 2012-13లో ఇది 16,604 కోట్ల రూపాయలుగానే ఉంది.

లాభాల్లో ఎయిర్‌టెల్
దేశీయంగా ప్రైవేట్‌రంగ టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమ త్రైమాసికంలో 60.9 శాతం పెరిగింది. ఈ ఏప్రిల్-జూన్ వ్యవధికిగానూ 1,108 కోట్ల రూపాయల లాభాన్ని మంగళవారం ఎయిర్‌టెల్ ప్రకటించింది. గత ఏడాది 689 కోట్ల రూపాయల నికర లాభంతోనే సరిపెట్టుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
ఆదాయం కూడా ఈసారి 13.3 శాతం ఎగబాకి 22,962 కోట్ల రూపాయలను తాకింది. క్రిందటిసారి 20,264 కోట్ల రూపాయలను అందుకుంది. ‘కన్సాలిడెటెడ్ మొబైల్ డేటా ఆదాయం 2,204 కోట్ల రూపాయలకు చేరుకుంది. గత ఏడాదితో పోల్చితే ఇది 73.9 శాతం వృద్ధి చెందింది.' అని ఎయిర్‌టెల్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
ఆకట్టుకున్న ఐటిసి
బహుళ వ్యాపార దిగ్గజ సంస్థ ఐటిసి లిమిటెడ్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో గతంతో పోల్చితే 15.6 శాతం పెరిగింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 2,186.39 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఎఫ్‌ఎమ్‌సిజి, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారంలో జరిగిన భారీ అమ్మకాలే దీనికి కారణం. కాగా, గత ఏడాది ఏప్రిల్-జూన్‌లో 1,891.33 కోట్ల రూపాయల నికర లాభాలను ఐటిసి పొందింది. ఇక నికర అమ్మకాలు 24.88 శాతం పెరగగా, ఈసారి 9,164.42 కోట్ల రూపాయలుగా, పోయినసారి 7,338.52 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications