
సుబ్రతా రాయ్ విజ్ఞప్తిపై సమీక్ష నిర్వహిస్తామని సుప్రీం కోర్టు న్యాయమూర్తికి జైలు సీనియర్ అధికారులు తెలిపారు. తమ సంస్థ ఆస్తులు విక్రయించేందుకు కొనుగోలుదారులతోపాటు ఇతర ప్రతినిధులను కలుసుకోవడానికి, చర్చలు జరపడానికి వీడియో కాన్ఫరెన్స్ సేవలు అవసరముందని సుబ్రతా రాయ్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
ఒక వేళ సుప్రీం కోర్టు అనుమతిస్తే.. వైఫై, వీడియో కాన్ఫరెన్స్, లాప్‌టాప్‌లకు అవసరమయ్యే ఖర్చును సహారా భరించాల్సి ఉంటుందని తెలిపారు. సుబ్రతా రాయ్‌ను ఎంతమంది సందర్శకులు, ఎన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, సిబ్బంది సంఖ్యపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కూడా ఓ సమీక్ష నిర్వహించనున్నారు.
బెయిల్ కోసం తక్షణం రూ. 10వేల కోట్లు చెల్లిస్తే బెయిల్ ఇస్తామని సుప్రీం కోర్టు ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే. అంత మొత్తం ఒకేసారి చెల్లించలేమని ముందు రూ. 2,500 కోట్లు చెల్లించి అనంతరం మరో 2,500 కోట్లు చెల్లిస్తామని, మిగితా మొత్తాన్ని మరోసారి చెల్లిస్తామని సుబ్రతా న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో సుబ్రతా రాయ్ గత మార్చి 4 నుండి జైలులో ఉంటున్నారు.


Click it and Unblock the Notifications