న్యూఢిల్లీ: రిటైల్ ఔట్‌లెట్ల ప్రారంభోత్సవంలో ప్రైవేట్‌రంగ టెలికాం ఆపరేటర్ యునినార్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఒకేరోజు, ఒకే సమయానికి 362 రిటైల్ ఔట్‌లెట్లను తెరవడం ద్వారా ఈ రికార్డును సాధించామని సోమవారం యునినార్ తెలిపింది.
ఈ రకంగా ప్రపంచంలో ఎక్కడా, ఏ సంస్థ కూడా ప్రారంభించలేదని సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రాజీవ్ సేథి ఓ ప్రకటనలో చెప్పారు. ఈ ఘనతలో తమ ఉద్యోగులు, కస్టమర్లందరికీ భాగస్వామ్యం ఉందని తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్ (పశ్చిమ), ఉత్తరప్రదేశ్ (తూర్పు), బీహార్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ సర్కిళ్లలో యునినార్ కార్యకాలపాలు సాగుతున్నాయని చెప్పారు.
30 కోట్లు దాటిన ఎయిర్‌టెల్ కస్టమర్లు

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీగా ఉన్న భారతీ ఎయిర్‌టెల్ మరో ఘనతను సాధించింది. కంపెనీకి చెందిన మొబైల్, ఫిక్స్‌డ్ లైన్, డిఎస్‌ఎల్, డిటిహెచ్ సేవలనందుకునే వినియోగదారుల సంఖ్య 30 కోట్లు దాటింది. 1995లో సర్వీసులు ప్రారంభించిన ఈ కంపెనీ 2009లో 10 కోట్ల మైలురాయిని, 2012లో 20 కోట్ల మైలురాయిని అధిగమించింది. కంపెనీ వినియోగదారుల సంఖ్య 20 నుంచి 30 కోట్లు చేరేందుకు కేవలం 2 సంవత్సరాలు పట్టిందని కంపెనీ వెల్లడించింది.
ఎయిర్‌టెల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నాలుగో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా అవతరించినట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఆసియా, ఆఫ్రికాల్లో కలిపి కంపెనీ 20 దేశాల్లో సేవలనందిస్తోంది. ప్రస్తుత రికార్డు తమ కార్యకలాపాల బలాన్ని తెలియజేస్తుందని, భవిష్యత్‌లో మరిన్ని రికార్డులను సాధిస్తామని కంపెనీ సిఈఓ, ఎండి (భారత్, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ అన్నారు. దేశీయ వైర్‌లెస్ వినియోగదారుల మార్కెట్లో కంపెనీకి 22.88 శాతం వాటా ఉంది. కంపెనీకి 20.88 మొబైల్ వినియోగదారులు, 33 లక్షల మంది వైర్‌లైన్ వినియోగదారులున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications