హైదరాబాద్/న్యూఢిల్లీ: ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసిఏఐ)కు నూతన ప్రెసిడెంట్‌గా హైదరాబాద్‌కు చెందిన కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్‌గా హైదరాబాద్‌కు చెందిన కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ డాక్టర్ ఏఎస్ దుర్గా ప్రసాద్ ఎన్నికయ్యారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి(2014-15) దుర్గా ప్రసాద్ ఐసిఏఐ ప్రెసిడెంట్‌గా వ్యవహరించనున్నారు. గతంలో దుర్గా ప్రసాద్ ఐసిఏఐ దక్షిణ భారత ప్రాంత కౌన్సిల్ ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు.

త్వరలోనే నల్లధనం తెస్తాం: జైట్లీ
న్యూఢిల్లీ: విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకువచ్చేందుకు ఇంకెంతో కాలం పట్టదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అక్రమార్కులు విదేశాల్లో దాచుకుంటున్న మొత్తం సంపదను దేశంలోకి తేచ్చేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. ఫ్రాన్స్ నుంచి అందుకున్న నల్లధనం సమాచారంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. నల్లధనం వ్యవహారానికి అధికార పరిధి అంటూ ఏమీలేదని తేల్చిచెప్పిన ఆయన, దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశామని తెలిపారు.
‘మా వద్ద ఏదైనా సమాచారం (నల్లధనానికి సంబంధించి) ఉంటే, దాన్ని మేము సుప్రీం కోర్టుతో పంచుకుంటాం. అలాగే సిట్‌కు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది.' అని శుక్రవారం లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా జైట్లీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విదేశాల్లోని నల్లధనాన్ని వెలికితీసేందుకు ఇంకా ఎంతో సమయం పట్టదని పేర్కొన్నారు. లీచెన్‌స్టెయిన్, స్విట్జర్లాండ్‌లోని ఓ బ్యాంకులో భారతీయుల ఖాతాలకు సంబంధించిన సమాచారం ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం అందుకుందని కూడా ఆయన చెప్పారు.
More From GoodReturns

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications