ఇకత్‌మేళా: తళుక్కుమన్న నటి దీపు(పిక్చర్స్)
హైదరాబాద్: అత్యాధునిక పద్ధతుల్లో నేత కార్మికులు రూపొందించిన హ్యాండ్‌లూమ్ ఉత్పత్తుల ప్రదర్శన ‘పోచంపల్లి ఇకత్ మేళా -2014' నగరంలోని మాదాపూర్‌లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో గల రాడ్ ఆర్ట్ గ్యాలరీలో కొలువుదీరింది. టాలీవుడ్ నటి, ‘కొత్త జంట' మూవీ ఫేం దీపు నాయుడు ఈ మేళాను శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇక్కడి ప్రదర్శనలో ఉంచిన విభిన్న రకాల హ్యాండ్‌లూమ్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్, సిల్క్ అండ్ కాటన్, ఇతర అప్పెరల్స్ మగువల మనసు దోచే విధంగా ఉన్నాయని అన్నారు. ఈ తరహా ప్రదర్శనలతో చేనేత కార్మికులు తమ ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఇంకా తాను నటించిన ‘అల్లుడు శీను' సినిమా శుక్రవారం విడుదల కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ‘కేరింత'లో నటిస్తున్నట్లు చెప్పారు.
పోచంపల్లి హ్యాండ్‌లూమ్ పార్క్ సిఈఓ దామోదర్, ఛైర్మన్ దేవేందర్, మాజీ ఛైర్మన్ కృష్ణాలు పాల్గొన్నారు. ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగనున్న ఈ మేళాలో వందలాది రకాల హ్యాండ్‌లూమ్ దుస్తులైన చీరలు, డ్రెస్ మెటీరియల్స్, హోమ్ ఫర్నిషింగ్ వంటి వందల రకాలు అందుబాటులో ఉంచామని వివరించారు. నేత కార్మికులు సృజనాత్మకతను మరింత ప్రోత్సహిస్తూ, వారికి అవసరమైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ఈ మేళాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

దీపు నాయుడు
అత్యాధునిక పద్ధతుల్లో నేత కార్మికులు రూపొందించిన హ్యాండ్‌లూమ్ ఉత్పత్తుల ప్రదర్శన ‘పోచంపల్లి ఇకత్ మేళా -2014' నగరంలోని మాదాపూర్‌లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో గల రాడ్ ఆర్ట్ గ్యాలరీలో కొలువుదీరింది.

దీపు నాయుడు
టాలీవుడ్ నటి, ‘కొత్త జంట' మూవీ ఫేం దీపు నాయుడు ఈ మేళాను శుక్రవారం ప్రారంభించారు.

దీపు నాయుడు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇక్కడి ప్రదర్శనలో ఉంచిన విభిన్న రకాల హ్యాండ్‌లూమ్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్, సిల్క్ అండ్ కాటన్, ఇతర అప్పెరల్స్ మగువల మనసు దోచే విధంగా ఉన్నాయని అన్నారు.

దీపు నాయుడు
ఈ తరహా ప్రదర్శనలతో చేనేత కార్మికులు తమ ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం లభిస్తుందన్నారు.

దీపు నాయుడు
ఇంకా తాను నటించిన ‘అల్లుడు శీను' సినిమా శుక్రవారం విడుదల కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ‘కేరింత'లో నటిస్తున్నట్లు చెప్పారు.

దీపు నాయుడు
పోచంపల్లి హ్యాండ్‌లూమ్ పార్క్ సిఈఓ దామోదర్, ఛైర్మన్ దేవేందర్, మాజీ ఛైర్మన్ కృష్ణాలు పాల్గొన్నారు.

దీపు నాయుడు
ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగనున్న ఈ మేళాలో వందలాది రకాల హ్యాండ్‌లూమ్ దుస్తులైన చీరలు, డ్రెస్ మెటీరియల్స్, హోమ్ ఫర్నిషింగ్ వంటి వందల రకాలు అందుబాటులో ఉంచామని వివరించారు.

దీపు నాయుడు
మేళాను ప్రారంభించిన అనంతరం ప్రదర్శనలోని వివిధ ఉత్సత్తులను దీపు నాయుడు పరిశీలించారు.

దీపు నాయుడు
మేళాను ప్రారంభించిన అనంతరం ప్రదర్శనలో సందడి చేసిన నటి దీపు నాయుడు.

దీపు నాయుడు
ఇకత్ మేళాను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సినీ నటి దీపు నాయుడు.


Click it and Unblock the Notifications