హైదరాబాద్‌లో బులియన్ ఇండియా శాఖ
హైదరాబాద్/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాల దిగుమతులపై ఆంక్షలు సడలించిన నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. వారి ఆసక్తిని గమనించిన ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోళ్లు, అమ్మకాలు సాగిస్తున్న బులియన్ ఇండియా, చిన్న మొత్తాల్లో పెట్టుబడులపై దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు హైదరాబాద్‌లో బులియన్ ఇండియా కొత్త శాఖను ప్రారంభించనున్నట్లు సంస్థ డైరెక్టర్ సచిన్ కొఠారీ తెలిపారు. గ్రాము బంగారం, గ్రాము వెండిని టోకు ధరలకు కొనే అవకాశాన్ని కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.

స్టోరేజీ ఫీజు లేకుండా ఉచిత బీమా, బ్రోకరేజ్, అకౌంట్ ఓపెనింగ్ ఛార్జీలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కామర్స్ సైట్స్, బ్యాంక్ నాణేలతో పోలిస్తే 5 నుంచి 8 శాతం ధరలు తక్కువగా ఉంటాయని ఆయన వెల్లడించారు.
మొత్తం వ్యాపారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 10 శాతం వ్యాపారం జరుగుతోందని తెలిపారు. అందుకే ఇక్కడ బ్రాంచ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులపై యూపిఏ సర్కారు హయాంలో విధించిన ఆంక్షలు యధావిధిగా కొనసాగనున్నాయి. గత ప్రభుత్వం విధించిన ఆంక్షలు, చేపట్టిన చర్యలు సంతృప్తికరమైన ఫలితాలిచ్చినందున వాటినలాగే కొనసాగించనున్నట్లు అరుణ్ చైట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications