లేపాక్షి ఎగ్జిబిషన్ ప్రారంభించిన నాయిని(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్ అండ్ హ్యాండ్ లూమ్స్ ఎగ్జిబిషన్‌ను తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శుక్రవారం ప్రారంభిచారు. ఈ ఎగ్జిబిషన్ జులై 18 నుంచి ఆగస్టు 4 వరకు కొనసాగుతుందని ఎగ్జిబిషన్ నిర్వాహకులు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన హ్యాండీక్రాఫ్ట్, హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హైదరాబాదీ ముత్యాలు, కర్రతో చేసిన కొండపల్లి, ఏటికొప్పాక, నిర్మల్ బొమ్మలు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు తిరుపతి, బతియా, చెరియాల, నిర్మల్, వరంగల్ నుంచి తెప్పించిన వివిధ రకాల ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు.
లెదర్ ఉత్పత్తులు, వివిధ రకాల కృత్రిమ ఆభరణాలు, కర్రతో చేసిన వివిధ ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచినట్లు తెలిపారు. అంతేగాక సాంప్రదాయ సిల్క్, కాటర్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, సూట్ సెట్స్, గద్వాల్, పోచంపల్లి, ఉప్పాడ, నారాయణపేట్, మంగళగిరి, వెంకటగిరి, కలంకారి వస్త్రాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. జులై 18 నుంచి ఆగస్టు 4 వరకు ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రదర్శన కొగసాగుతుందని తెలిపారు.

నాయిని
నగరంలో లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్ అండ్ హ్యాండ్ లూమ్స్ ఎగ్జిబిషన్‌ను తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శుక్రవారం ప్రారంభిచారు.

నాయిని
ఈ ఎగ్జిబిషన్ జులై 18 నుంచి ఆగస్టు 4 వరకు కొనసాగుతుందని ఎగ్జిబిషన్ నిర్వాహకులు తెలిపారు.

నాయిని
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన హ్యాండీక్రాఫ్ట్, హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.

నాయిని
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హైదరాబాదీ ముత్యాలు, కర్రతో చేసిన కొండపల్లి, ఏటికొప్పాక, నిర్మల్ బొమ్మలు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. . వీటితోపాటు తిరుపతి, బతియా, చెరియాల, నిర్మల్, వరంగల్ నుంచి తెప్పించిన వివిధ రకాల ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు.

నాయిని
లెదర్ ఉత్పత్తులు, వివిధ రకాల కృత్రిమ ఆభరణాలు, కర్రతో చేసిన వివిధ ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచినట్లు తెలిపారు.

నాయిని
అంతేగాక సాంప్రదాయ సిల్క్, కాటర్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, సూట్ సెట్స్, గద్వాల్, పోచంపల్లి, ఉప్పాడ, నారాయణపేట్, మంగళగిరి, వెంకటగిరి, కలంకారి వస్త్రాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications