For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెల్‌కాన్ మొబైల్స్ ఆవిష్కరించిన కెటిఆర్(పిక్చర్స్)

|

హైదరాబాద్: మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మార్కెట్‌లోకి 4జి మొబైళ్లను తీసుకురావాల్సి ఉందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. సాంకేతికతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే త్వరలోనే హైదరాబాద్‌లో 4జి సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. సెల్‌కాన్ మొబైల్ తమ కొత్త మోడల్స్ మిలీనియం పవర్ క్యూ 3000, మిలీనియం ఎలైట్ క్యూ 470లను మంగళవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది.

ఈ కార్యక్రమానికి మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరై మొబైల్స్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్‌లో విదేశీ తయారీ సెల్‌ఫోన్ల హవా నడుస్తోందని, వాటి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా టెక్నాలజీలో దేశీయ కంపెనీ అయిన సెల్‌కాన్ మొబైల్స్ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సెల్‌కాన్ కంపెనీ అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ ఉన్న మొబైళ్లను సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే ధరలో అందించడం గొప్ప విషయమన్నారు.

కెటిఆర్

కెటిఆర్

సెల్‌కాన్ మొబైల్ తమ కొత్త మోడల్స్ మిలీనియం పవర్ క్యూ 3000, మిలీనియం ఎలైట్ క్యూ 470లను మంగళవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు మొబైల్స్‌ను ఆవిష్కరించారు.

కెటిఆర్

కెటిఆర్

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మార్కెట్‌లోకి 4జి మొబైళ్లను తీసుకురావాల్సి ఉందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు.

కెటిఆర్

కెటిఆర్

ప్రస్తుతం మార్కెట్‌లో విదేశీ తయారీ సెల్‌ఫోన్ల హవా నడుస్తోందని, వాటి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా టెక్నాలజీలో దేశీయ కంపెనీ అయిన సెల్‌కాన్ మొబైల్స్ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

కెటిఆర్

కెటిఆర్

సెల్‌కాన్ కంపెనీ అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ ఉన్న మొబైళ్లను సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే ధరలో అందించడం గొప్ప విషయమన్నారు.

కెటిఆర్

కెటిఆర్

మూడు, నాలుగు నెలల్లోనే అత్యాధునిక పరిజ్ఞానంతో 4జి మొబైళ్లను రూపొందిస్తామని వెల్లడించారు. దేశంలో మొట్టమొదటి 4జి మొబైల్స్ తామే మార్కెట్‌లోకి తీసుకువస్తామని తెలిపారు.

మూడు, నాలుగు నెలల్లోనే అత్యాధునిక పరిజ్ఞానంతో 4జి మొబైళ్లను రూపొందిస్తామని సెల్‌కాన్ సిఎండి గురు వెల్లడించారు. దేశంలో మొట్టమొదటి 4జి మొబైల్స్ తామే మార్కెట్‌లోకి తీసుకువస్తామని తెలిపారు. మిలీనియం మోడళ్ల ప్రత్యేకతలు సెల్‌కాన్ మొబైల్స్ ఈడి మురశీ మాట్లాడుతూ.. కొత్త మోడళ్ల ప్రత్యేకతలను వివరించారు.

మిలీనియం పవర్ క్యూ 3000 కిట్‌కాట్ ఓఎస్, 1.3 జిహెచ్స్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 5 ఇంచుల డిస్‌ప్లే, 9.9 ఎంఎం మందం, 1జిబి ర్యామ్, 4 జిబి రోమ్ కలిగి ఉండడంతోపాటు 3000 ఎంఎహెచ్ బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటుందని వివరించారు. 8 మెగా పిక్సల్ రీయర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 32 జిబి ఎక్స్‌స్పాండబుల్ మొమొరీ సౌకర్యం కలిగి ఉన్న ఈ మొబైల్ ధర కేవలం రూ. 8999 అని చెప్పారు. అలాగే మిలీనియం ఎలైట్ క్యూ 470 మోడల్ స్మార్ట్ఫోన్ కూడా కిట్‌కాట్ ఓఎస్, 16 జిబి రోమ్, 1 జిబి ర్యామ్, 1.3 జిహెచ్స్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ కలిగి ఉంటుందన్నారు. ఈ మోడల్ ధర రూ. 11,999 అని తెలిపారు.

English summary

సెల్‌కాన్ మొబైల్స్ ఆవిష్కరించిన కెటిఆర్(పిక్చర్స్) | KTR launches Celkon Smartphone at Taj Deccan

Telangana IT Minister K Taraka Rama Rao on Tuesday launched Celkon Smartphone at Taj Deccan in Hyderabad.
Story first published: Wednesday, July 16, 2014, 11:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X