హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువ ఇంజనీర్లు, పట్టభద్రులకు దాదాపు 13వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయట. విశాఖపట్నంలో మూడు సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించనుంది. రానున్న మంత్రి మండలి సమావేశంలో ఐటి పరిశ్రమ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఐటీలో పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం పారదర్శకత, ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.
విశాఖలో ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు అవసరమైన సదుపాయాల కలపనకు విశాఖ ఐటీ కారిడార్‌ను పారిశ్రామిక ప్రాంత స్థానిక ప్రాధికారిక సంస్థ కిందకు తీసుకు రానున్నారు. మధురవాడ ఐటీ సెజ్ డీనోటిఫై పైన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయట. ఇప్పటి వరకు ఏపీలో విశాఖలో మాత్రమే ఐటీ పరిశ్రమలు ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ఇక్కడ ఐటీ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా టెక్ మహీంద్రా సంస్థ 5వేల మందికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది.

ఈ సంస్థకు విశాఖ ఐటీ లే అవుట్లో దాదాపు పది ఎకరాలు ఇచ్చే అవకాశముందట. విప్రో సంస్థ తమ వ్యాపార విస్తరణలో భాగంగా 7,500 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చిందట. ఈ రెండు సంస్థలకు అవసరమైన భూములను ఇచ్చేందుకు ప్రభుత్వం త్వరలో అధికారిక నిర్ణయం తీసుకోనుందట.
ఇవి ప్రారంభమైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై వేల మందికి పైగా ఉపాధి లభించనుందంటున్నారు. మరోవైపు జాతీయ స్థాయిలో అప్లయిడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, పరిశోధన సొసైటీ పరిశోధన విభాగాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీంతో మరిన్ని ఉద్యోగాలు రానున్నాయి.
విశాఖ ఐటీ జోన్‌ను ఐలా (పారిశ్రామిక ప్రాంత స్థానిక ప్రాధికారిక సంస్థ)గా ప్రకటించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో హైటెక్ సిటీ, ఆదిభట్లనను ఐలాగా గుర్తించారు. ఐలాగా గుర్తిస్తే ఐటీ పరిశ్రమలకు అవసరమైన రహదారులు, వీధి లైట్లు, మురుగు నీటి పారుదల, పన్నుల వసూలు వ్యవస్థ, లే అవుట్లు వేయడం, మౌలిక సదుపాయాల నిర్వహణ బాధ్యత ఏపీఐఐసీ పరిధిలో ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications