పోతపోసినట్లు చేతి ఉత్పత్తులు (పిక్చర్స్)
హైదరాబాద్: హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ హైదరాబాదులోని లేపాక్షి చేనేత, చేనేత వృతి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేసింది. హైదరాబాదులోని ఆసియానా ఫంక్షన్ హాల్లో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో దేశమంతటి నుంచి 70 మంది చేనేవృతి కళాకారులు పాల్గొంటున్నారు. తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.
లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్యూమ్ ప్రధర్శన వృతికళాకారుల ఉత్పత్తుల అమ్మకాల పెరిగి, వారి జీవన స్థితిగతులు మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత వృత్తిదారులు, కళాకారులు, తమ టెక్స్‌టైల్స్‌ను ప్రదర్శిస్తున్నారు.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ముత్యాలను, నిర్మల్ కొయ్యబొమ్మలను, తిరుపతికి చెందిన వూడెన్ వాల్ కార్వింగ్స్, శ్రీకాళహస్తి కళాచిత్రాలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. చేర్యాల, నిర్మల్ పెయింటింగ్స్, నర్సాపూర్ లేస్ వర్క్, వరంగల్‌కు చెందిన ప్రత్యేక ఉత్పత్రులు నిమ్మలకుంట తోలు బొమ్ములు, దీపం షేడ్స్ ఉన్నాయి.

సిల్క్, కాటన్ చీరెలు
సంప్రదాయబద్దమైన గద్వాల, పోచంపల్లి, ఉప్పాడ, నరాయణపేట, మంగళగిగి, వెంకటగిరి సిల్క్, కాటన్ చీరెలు, డ్రెస్ మెటిరీయల్, ఇతర ఉత్పత్తులు ప్రదర్శనలో ఉన్నాయి.

హైదరాబాద్ ఆభరణాలు
హైదరాబాదుకు చెందిన కృత్రిమ ఆభరణాలు, కాస్టింగ్స్, ఇతర ఉత్పత్తులు ప్రదర్శనలో ఉన్నాయి. మచిలీపట్నం బ్లాక్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ప్రదర్శనలో పోతపోసినట్లుగా ఉన్నాయి.

చేతివృత్తుల కళాఖండాలు
ప్రదర్శనలో అత్యంత ప్రతిభావంతంగా తీర్చిదిద్దిన కళాఖండాలు ప్రదర్శితమవుతున్నాయి. చేతివృత్తి కళాకారుల ప్రతిభకు ఇవి అద్దం పడుతున్నాయి.

సుందరమైన టేబుల్ క్లాక్
టేబుల్ క్లాక్‌ను కూడా ఇంత అందంగా తీర్చిదిద్దుకోవచ్చునని కళాకారులు నిరూపిస్తున్నారు. ఇంత అందంగా సమయం ఉంటుంది.

అందమైన కళాకృతి
చేతివృత్తి కళాకారుల చేతుల్లో ప్రతి వస్తువు ఇలా కళాకృతి ధరిస్తుంది. చూడడానికి అందంగానే కాకుండా ఆహ్లాదంగా కూడా ఉంటుంది.

అందానికి అందం
చేతివృత్తి కళాకారులు తమ వేళ్ల నైపుణ్యంతో రూపొందించి ఈ ఆభరణాలు ధరించేవారి అందం ఇనుమడిస్తుందనడంలో సందేహం లేదు.

ఇంత సౌందర్యం
కళంకారీ అద్దకాలు ఎంతో అందాన్ని సమకూరుస్తాయి. ప్రదర్శనలో ఇంత అందమైన ఉత్పత్తులను చూసి మురిసిపోకుండా ఉండగలమా..

చేనేత ఉత్పత్తులు ఇలా..
గద్వాల, పోచంపల్లి, వెంకటగిరి సిల్క్, కాటన్ చీరెలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. ఎవరికి నచ్చినవి వారు ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications