హైదరాబాద్: సెమీ కండక్టర్ హబ్‌గా రూపొందించడానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యాబ్ సిటీ 2008 నుంచి కంపెనీలను ఆకర్షించడంలో విఫలం కావడంతో ఆ స్థలంలో ఈ సిటీని అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఫ్యాబ్ సిటీ కోసం గత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 1,050 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ సెజ్‌ను సెమీ కండక్టర్ తయారీ కంపెనీలకు కేటాయించింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల గ్రామం వద్ద కేటాయించిన ఆ స్థలంలో ఆరేళ్ల తర్వాత కూడా 64 ఎకరాలు మాత్రమే ఉపయోగంలోకి వచ్చింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మిగతా భూమిని కెసిఆర్ ప్రభుత్వం ఈసిటీగా రూపొందించాలని భావిస్తోంది.

ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ఈ సిటీలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఫ్యాబ్ సిటీ భూమిని వాడుకుని ఈసిటీగా రూపుదిద్దే విషయంపై ఐటి మంత్రి కెటి రామారావు ఇది వరకే అధికారులతో పలుమార్లు చర్చించారు

దాదాపు 600, 400 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ క్లష్టర్స్ను ఏర్పాటు చేసే విషయంపై కెటి రామారావు ప్రణాళికను రూపొందిస్తున్నారు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications