గన్నవరం: విజయవాడ నుంచి హైదరాబాద్ మీదుగా చెన్నై ఎయిర్‌కోస్టా విమాన సర్వీసు శుక్రవారం ప్రారంభమైంది. విమానాశ్రయం డైరెక్టర్ బిజి పాటిల్, ఎయిర్ కోస్టా పరిపాలనా విభాగం జనరల్ మేనేజర్ కె. వినయ్ జ్యోతి వెలిగించి సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా విమానాశ్రయం డైరెక్టర్ పాటిల్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ విమానాశ్రయం ప్రధానంగా మారిందని అన్నారు. ప్రయాణికులు సౌకర్యార్థం ఇప్పటికే టర్మినల్ విస్తరణ, సకాలంలో లేజీ సేకరించుకునేందుకు కన్వేయర్ బెల్ట్ ఏర్పాటు, ఆప్రాన్‌ల పటిష్టత ఇలా అన్ని రకాల సేవలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

ఇంకా విమానాశ్రయం విస్తరణ, అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధంగా ఉంచామని, సర్వీసులు పెరిగే కొద్ది సౌకర్యాలను మెరుగుపరుస్తామని, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో మరింత ముందుకు సాగుతామని వివరించారు.
ప్రయాణికుల అవసరం దృష్ట్యా ఎయిర్ కోస్టా రెండో సర్వీసు ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఈ సర్వీసు చివరి మజిలీ మధురై అని తెలిపారు. 35 మంది ప్రయాణికులతో 7.45 గంటలకు ఎయిర్ కోస్టా విమానం హైదరాబాద్ బయలుదేరి వెళ్లింది.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications