న్యూఢిల్లీ: తన తర్వాత అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్‌గా తన కూతురు ప్రీతారెడ్డి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపక ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి ప్రీతాయే తన వారసురాలిగా అపోలో పగ్గాలు అందుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ వార్త ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.
బుధవారంనాడే ప్రీతా రెడ్డికి గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్‌పర్సన్ బాధ్యతలు కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే ఛైర్మన్ బాధ్యతలు ప్రీతా చేతికి వెళ్లే అవకాశం ఉందని ప్రతాప్ సి రెడ్డి ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అపోలో హాస్పిటల్స్ యాజమాన్యానికి సంబంధించిన షేర్లు ఇప్పటికే సమంగా విభజించామని, ప్రీతా రెడ్డి షేరు హోల్డింగ్‌లో ఎలాంటి మార్పు లేదని ఆయన పేర్కొన్నారు.

కాగా, కొత్త హోదాలో ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగంలో వస్తున్న మార్పులు, సమకాలీన పరిజ్ఞానం, ప్రమాణాలను కంపెనీకి చెందిన 8,000మంది వైద్యులతో ప్రీతారెడ్డి చర్చిస్తున్నట్లు అపోలో హాస్పిటల్ తెలిపింది.
అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలను ఆమె నేరుగా పర్యవేక్షిస్తారని, ఆరోగ్య సంరక్షణకు అపోలో హాస్పిటల్ గమ్యస్థానం కావాలన్న లక్ష్యాన్ని చేరడానికి కృషి చేస్తారని పేర్కొంది. 1989లో ప్రీతారెడ్డి అపోలో హాస్పిటల్స్‌లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్ల తర్వాత గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆమెకు కొత్త బాధ్యతలు అప్పగించారు.
ప్రతాప్ సి రెడ్డి నలుగురు కూతుళ్లలో ప్రీతాయే పెద్ద కుమార్తె. అపోలో పునర్ వ్యవస్థీకరణలో భాగంగా బుధవారం ప్రీతా రెడ్డితోపాటు శోభనా కామినేనికి ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ బాధ్యతలు అప్పగించారు. మరో ఇద్దరు కుమార్తులు సునీతా రెడ్డి, సంగీతా రెడ్డిలు మేనేజింగ్ డైరెక్టర్, సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ పదవులు చేపట్టారు. ప్రతాప్ సి రెడ్డి మరో ఇద్దరు కూతుర్లయిన సునీతా రెడ్డి, సంగీతా రెడ్డిలకు కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను కట్టబెట్టారు. హాస్పిటళ్లు, ఫార్మాసీలు, క్లినిక్‌లు, ఆరోగ్య బీమా రంగాల్లో లభించే వృద్ధి అవకాశాలపై అపోలో దృష్టి పెట్టేందుకు ఈ మార్పులు దోహదం చేయగలవని ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు.


Click it and Unblock the Notifications