తక్కువేనా?: విశాల్ వేతన ప్యాకేజి రూ.42 కోట్లు

న్యూఢిల్లీ/ముంబై: దేశీయ రెండో అతిపెద్ద ఐటి రంగ సంస్థ ఇన్ఫోసిస్ లిమిటెడ్ కొత్త సిఇఒ విశాల్ సిక్కా వార్షిక వేతనంగా 5.08 మిలియన్ డాలర్లు(రూ. 30కోట్లు) పొందనున్నారు. అలాగే మరో 2 మిలియన్ డాలర్ల(రూ.12 కోట్ల) విలువైన స్టాక్స్ దక్కించుకోనున్నారు. దీంతో ఏటా సిక్కా 7.08 మిలియన్ డాలర్ల(రూ.42 కోట్ల)ను అందుకోనున్నారు. వార్షిక వేతనంలో 9 లక్షల డాలర్లు బేస్ సాలరీగా ఉంటే, మిగతా 4.18 మిలియన్ డాలర్లు వేరియబుల్ పేగా ఉంది.

47 ఏళ్ల సిక్కా.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్‌డి శిబూలాల్ స్థానంలో ఆగస్టు 1 నుంచి ఇన్ఫోసిస్ సారథ్య బాధ్యతలను తీసుకోనున్న విషయం తెలిసిందే. జులై 30న వాటాదారుల అసాధారణ సమావేశం జరుగనున్నట్లు కంపెనీ సర్కూలర్ జారీ చేసింది. కాగా, దాదాపు మూడున్నర దశాబ్దాల ఇన్ఫోసిస్ చరిత్రలో ఓ సంస్థాగత, వ్యవస్థాపకేతర వ్యక్తి సంస్థ అత్యున్నత హోదాను అందుకోవడం కూడా ఇదే తొలిసారి.

With $5.08 mn salary, Infosys’ Vishal Sikka is highest paid CEO in Indian IT

ఇదిలావుంటే వివిధ అంతర్జాతీయ సంస్థల సిఈఓ వేతనాలతో పోల్చితే సిక్కాకు ఇన్ఫోసిస్‌లో దక్కుతున్నది చాలా తక్కువే కావడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్లకు ఏటా 18 మిలియన్ డాలర్లు దక్కుతుండగా, ఐబిఎమ్ సిఈఓ 16.2 మిలియన్ డాలర్లు పొందుతున్నారు. సిటి బ్యాంక్ సిఈఓ 14.4 మిలియన్ డాలర్లు తీసుకుంటున్నారు.

సరికొత్త స్థాయిని అందుకున్న మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం సరికొత్త స్థాయిని అందుకున్నాయి. వచ్చే వారం లోక్‌సభలో ప్రవేశపెట్టే బడ్జెట్‌పై మదుపర్లలో నెలకొన్న అంచనాలను పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వృద్ధిరేటును పెంచే, లోటులను తగ్గించే చర్యల పట్ల ముందస్తు సంకేతాలివ్వడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. రాబోయే బడ్జెట్‌లో సాహసోపేతమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోబోతున్నట్లు చెప్పడం మదుపర్లలో ఉత్సాహం రెట్టించింది.

విదేశీ నిధుల రాక వెల్లువెత్తడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు వెలువడటం మార్కె ట్ సెంటిమెంట్ బలపడేందుకు దోహదపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీలోని 12 రంగాల సచీ ఇండెక్స్‌ల్లో అన్నీ రెండు శాతం కన్నా పైబడిన లాభంతోనే క్లోజయ్యాయి. మెటల్, హెల్త్‌కేర్, పవర్, కాపిటల్ గూడ్స్, ఆటో, ఎఫ్ఎంసిజి, బ్యాంకింగ్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు పరుగులో ముందు వరుసలో నిలిచాయి.

సర్వత్రా నెలకొన్న ఆశావహ దృక్పథంలో బిఎస్ఇ ప్రధాన సూచిక ఎస్ అండ్ పి సెన్సెక్స్ ఇంట్రాడేలో 25,864.53 పాయింట్ల చారిత్రక గరిష్ఠ స్థాయికి దూసుకుపోయి చివరికి 324.86 పాయింట్ల భారీవృద్ధితో 25,841.21 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలోని నిఫ్టీ కూడా 90.45 పాయింట్ల వృద్ధితో 7725.15 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 7732.40 పాయింట్ల చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకింది. రెండు ఇండెక్స్‌లూ చారిత్రక గరిష్ఠ స్థాయిల్లో ముగిశాయి. నాలుగు వరుస ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 778.54 పాయింట్లు, నిఫ్టీ 232 పాయింట్లు లాభపడ్డాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+