న్యూఢిల్లీ: గూగుల్‌కు చెందిన తొలి సోషల్ నెట్‌వర్క్ అయిన ఆర్కుట్.. ఇక ముందు కనిపించదు. ఎందుకంటే సెప్టెంబర్ 30 నుంచి ఆర్కుట్ సేవలను శాశ్వతంగా నిలిపేయాలని గూగుల్ నిర్ణయించింది. పదేళ్ల కిందట ఈ సేవలను ప్రారంభించిన ఆర్కుట్.. భారత్, బ్రెజిల్‌లలో మంచి పేరును తెచ్చుకుంది. అయితే మిగితా ప్రాంతాల్లో గొప్పగా రాణించలేకపోయింది. ఫేస్‌బుక్ వంటి నెట్‌వర్క్‌ల నుంచి ఎదురైన పోటీని తట్టుకోలేకపోయింది.
ఆర్కుట్‌కు వెబ్‌సైట్‌కు ఎంతమంది వినియోగదార్లున్నారన్న విషయాన్ని మాత్రం ఆర్కుట్ బయటకు వెల్లడించలేదు. అయితే బ్రెజిల్ నుంచి 50.6శాతం మంది ఉండగా, మరో 20.44శాతం మంది భారత్ నుంచి ఉన్నారు. అమెరికా, పాకిస్థాన్‌ల నుంచి 17.78శాతం, 0.86శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నట్లు ఆ వెబ్‌సైట్లో సమాచారం ఉంది. ‘గత పదేళ్లలో యూట్యూబ్, బ్లాగర్, గూగుల్ ప్లస్‌లు ప్రపంచంలోని ప్రతి మూలలోని కమ్యూనిటీలకూ చేరుకున్నాయి. దీంతో ఆర్కుట్ వృద్ధి చెందలేకపోయింది. కాబట్టి దానికి వీడ్కోలు పలకాలని నిర్ణయించినట్లు' ఆర్కుట్ బ్లాగ్‌లో గూగుల్ వివరించింది.

విచిత్రం ఏమిటంటే ఆర్కుట్ ప్రారంభమైన 2004 సంవత్సరంలోనే ఫేస్‌బుక్ కూడా మొదలైంది. 128 కోట్ల మంది యూజర్లతో ప్రస్తుతం ఫేస్‌బుక్ ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్‌వర్క్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తొలుత ఫేస్‌బుక్‌కు ఆర్కుట్ గట్టి పోటీ కూడా ఇచ్చింది. 2010లో ఆర్కుట్‌ను ఫేస్‌బుక్ అధిగమించింది. ఆ సంవత్సరం జులైలో మనదేశంలో 2.09 కోట్ల మంది వినియోగదార్లను నమోదు చేసుకుంది.
ఆర్కుట్ మాత్రం 1.99 కోట్ల మందితో సరిపెట్టుకుంది. ఆ తర్వాత ఆర్కుట్ తన ప్రభావాన్ని కోల్పోతూ వచ్చింది.
ఈ నేపథ్యంలోనే ఆర్కుట్‌ను శాశ్వతంగా మూసివేయాలని గూగుల్ నిర్ణయించింది. కాగా, ఆర్కుట్‌కు చెందిన అన్ని కమ్యూనిటీల ఆర్కైప్‌లను భద్రపరుస్తామని గూగుల్ వెల్లడించింది. సెప్టెంబర్ 30 నుంచి అవి అందుబాటులో ఉండనున్నాయని పేర్కొంది.


Click it and Unblock the Notifications