అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఫేస్‌బుక్ సిఓఓ

హైదరాబాద్: భారత్ అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని, ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగల సత్తా భారత్‌కు ఉందని ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సిఓఓ) షెరిల్ శాండ్‌బర్గ్ అన్నారు. బిల్‌క్లింటన్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న కాలంలో అమెరికా ఖజానా విభాగం చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఆమె పని చేశారు. గూగుల్‌లో గ్లోబల్ ఆన్‌లైన్ సేల్స్, ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా, ప్రపంచ బ్యాంకులో ఆర్థికవేత్తగానూ, మెకిన్సే అండ్ కంపెనీలో మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ గానూ శాండ్‌బర్గ్ పనిచేశారు.

ఆమె భారత్‌కు వచ్చిన సందర్భంగా పిటిఐతో మాట్లాడారు. ప్రస్తుతం 2 లక్షల కోట్ల డాలర్ల విలువైన భారత ఆర్థిక వ్యవస్థకు ఉద్యోగాలు సృష్టించడంతోపాటు వృద్ధికి ఊతం ఇవ్వగల సత్తా ఉందని, చిన్న-మధ్య తరహా వ్యాపార సంస్థలు(ఎస్ఎంబి) అండ పెట్టని కోట అని శాండ్‌బర్గ్ విశ్లేషించారు. కాగా, భారత్‌లో 2.61 కోట్ల సంఖ్యలో ఉన్న సూక్ష్మ, లఘు, మధ్యతరహా వ్యాపార సంస్థలు భారత స్థూల దేశీయోత్పత్తి(జిడిపి)లో దాదాపు 8శాతం సమకూర్చుతూ, 5.95 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని అంచనా.

India has potential to be world's largest economy: Facebook COO Sheryl Sandberg

అమెరికా వంటి దేశాలకే అదనపు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడం గగనంగా ఉన్న తరుణంలో భారత్ ఇటీవల సాధిస్తున్న వృద్ధిని గమనిస్తే మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనలో ప్రపంచంలోనే తొలివరుసలో ఉన్నదని ఆమె ప్రశంసించారు. ఏ దేశంలో అయినా ఎంత మంది ఔత్సాహిక పారిశ్రామికులు ఉన్నారన్న దానిపై ఆ దేశ ప్రగతి ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు. ఎస్ఎంబిలే వృద్ధికి ఊతం ఇస్తాయని తాను పలు దేశాల సందర్శన సమయంలో గుర్తించినట్టు ఆమె చెప్పారు.

ఇంటర్నెట్ ద్వారా ప్రజలు అనుసంధానమై ఎస్ఎంబిలకు మరింత అధిక సంఖ్యలో వినియోగదారులు సమకూరడానికి దోహదపడుతున్నారని, అది వృద్ధికి బాటలు వేస్తుందని షెరిల్ పేర్కొన్నారు. భారత్‌తో తనకు గల దీర్ఘకాలిక అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. 1981లో ప్రపంచబ్యాంకు లెప్రసీ ప్రోగ్రామ్‌లో భాగంగా తొలిసారి భారత్‌లో ఆమె పని చేశారు. ఇప్పుడు భారత్‌కు కుష్ఠువ్యాధి ఏ మాత్రం ముప్పు కాదంటూ నాటి పరిస్థితితో పోల్చితే భారత్ గత రెండు దశాబ్దాల కాలంలో ఎంతో మారిపోయిందని ఆమె అన్నారు.

భారత విజయగాథలో ఫేస్‌బుక్

ప్రపంచంలో ఫేస్‌బుక్ యూజర్ల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో తొమ్మిది లక్షల ఎస్ఎంబిలు ఫేస్‌బుక్ మాధ్యమంగా కస్టమర్లకు చేరువయ్యాయని షెరిల్ తెలిపారు. దేశంలో పది కోట్ల మందికి పైగా ఫేస్‌బుక్ యూజర్లున్నారు. వారిలో 84 లక్షల మంది మొబైల్ ద్వారా ఫేస్‌బుక్‌తో అనుసంధానమై ఉన్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. భారత్‌లో టెక్నాలజీ పట్ల ఆదరణ పెరుగుతున్న కొద్ది సోషల్ మీడియా మరింతగా విస్తరిస్తున్నదని ఆమె అన్నారు.

యూజర్లు ఎక్కువ సంఖ్యలో తాము కొనుగోలు చేయాలనుకునే వస్తువుల గురించిన సమాచారాన్ని సోషల్ నెట్‌వర్కింగ్ ఆధారంగా పొందే ప్రయత్నం చేస్తున్నారని, మరింత అధిక సంఖ్యలో ఎస్ఎంబిలు దీన్ని అవకాశంగా మలుచుకోవాలని ఆమె సూచించారు. భారత విజయగాథలో ఫేస్‌బుక్ చురుకైన భాగస్వామి కావాలనుకుంటున్నదని ఆమె చెప్పారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+