టికి కావాల్సిన గణాంకాలు ఇస్తాం: రంగరాజన్
హైదరాబాద్: తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలకు అవసరమైన గణాంకాలను ఇచ్చేందుకు సిఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమేటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ (ఎఐఎంఎస్‌సిఎస్) సిద్ధంగా ఉందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ సి రంగరాజన్ పేర్కొన్నారు. గణిత పితామహుడు సిఆర్ రావు జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్‌లో 8వ స్టాటిస్టిక్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన రంగరాజన్ మాట్లాడారు. పెద్ద రాష్ట్రాలతో పోల్చితే ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తీర్చడంలో చిన్న రాష్ట్రాలకు వెసులుబాటు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పది జిల్లాలతో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పదేళ్లకు ప్రభుత్వ ప్రణాళికకు సంబంధించి అవసరమైన డేటా అందించేందుకు తమ ఇన్‌స్టిట్యూట్ సిద్ధంగా ఉందన్నారు.

వ్యవసాయ ఉత్పత్తులు మొదలుకొని వైద్యరంగంలో అవసరాలు, సాఫ్ట్‌వేర్ ఎగుమతులు, సేవలు తదితర రంగాలకు చెందిన గణాంకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణకు ప్రత్యేకంగా ఎఐఎంఎస్‌సిఎస్‌లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. వృద్ధి రేటును అంచనావేసి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడంలో గణాంకాలు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయన్నారు. నిత్వావసర సరుకుల ధరల పెరుగుదలను సులభంగా పసిగట్టేవి గణాంకాలు మాత్రమేనన్నారు. రెండు రాష్ట్రాలు గణాంకాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇలాంటి రంగాన్ని విద్యార్థులు కేరీర్‌గా ఎంచుకోవడం లేదని, ఇంజనీరింగ్, వైద్య విద్య వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారన్నారు. ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ రంగాల సమ్మిళితమే స్టాటిస్టిక్స్ అని, అటువంటి రంగాన్ని విద్యార్థులు కెరీర్‌గా ఎంచుకొని ఎదగాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎం జగన్నాథరావు, కుప్పం ద్రవిడ యూనివర్శిటీ ప్రథమ విసి అరుణాచలం ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏప్రిల్-2014లో ఎఐఎంఎస్‌సిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'స్టాటిస్టిక్స్ ఒలంపియాడ్-2014' విజేతలకు రంగరాజన్ బహుమతులు ప్రదానం చేశారు.


Click it and Unblock the Notifications