ఆన్‌లైన్ షాపింగ్: కూపన్ కోడ్స్ అంటే?

హైదరాబాద్: ప్రస్తుతం చాలా మంది వినియోగదారులు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే వారు ఆన్‌లైన్ షాపింగ్ చేసే ముందు ఆన్‌లైన్ కూపన్స్ గురించి, వాటిని ఎలా ఉపయోగించాలనే దానిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే ప్రతీ ఒక్కరినీ ఒక సందేహం వేధిస్తుంటుంది. అదేమిటంటే, మరేదైనా వెబ్‌సైట్ ఇంతకంటే తక్కువకు ఆ ఉత్పత్తిని అందిస్తుందా అని. అది తేల్చుకునేందుకు ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారు వివిధ సైట్లను చూస్తూ సమయం వృథా చేసుకుంటుంటారు.

ఒక వస్తువును ఒక బ్రాండ్‌లో ఎంచుకుంటే ఇతర బ్రాండ్‌లలో ఆ వస్తువు ఎంతకు లభిస్తోందో అదే వెబ్‌సైట్‌లో చూసే అవకాశం ఇప్పటికే ఉంది. అయితే ఒక వెబ్‌సైట్‌లో కొనుగోలుదారు ఓ వస్తువును ఎంచుకోగానే అదే వస్తువు ఇతర వెబ్‌సైట్లలో ఎంతకు లభిస్తుందో తెలుసుకునే అవకాశం కూడా ఇప్పుడు లభిస్తోంది.

ఆన్‌లైన్ కూపన్, డీల్ అంటే..

డిస్కౌంట్స్ ద్వారా మన సంపదను కొంత పొదుపు చేసుకోవాలని మనమందరం చూస్తాం. ఈ నేపథ్యంలో తక్కువ ధరలలో మంచి వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. ఆన్‌లైన్ కూపన్స్ ద్వారా వస్తువులను కొంత తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఈ సదుపాయాన్ని ఉపయోగించనట్లయితే ఇప్పుడు మొదలెట్టండి. ఉచిత ఆన్‌లైన్ కూపన్ సర్విసెస్‌ను ఉపయోగించి డబ్బును పొదుపు చేసే అవకాశాన్ని పొందండి. ఆన్‌లైన్ కూపన్ అనేది డిస్కౌంట్ కోడ్ లేదా సంఖ్యను కలిగి ఉంటుంది. ఆన్‌లైన్‌లో మాత్రమే కూపన్ ద్వారా వివిధ ఉత్పత్తుల వెబ్'సైట్లలో డిస్కౌంట్ లభిస్తుంది. కొన్ని ఆన్‌లైన్‌ కూపన్స్‌కు కాల పరిమితి నిర్ణియించబడి ఉంటుంది. ఆన్‌లైన్‌ కూపన్ సర్విసెస్‌ సైట్'లో కూపన్ కోడ్ అందుబాటులో ఉన్నప్పుడు కొనుగోలుదారులు నేరుగా షాపింగ్ చేయరాదు. కూపన్లను గమనించి కొనుగోలు చేయాలి.

If you SHOP online then you should know - What are Online Coupon codes?

ఆన్‌లైన్‌ కూపన్స్‌తో ప్రయోజనం ఏంటి?

ఆన్‌లైన్‌‌లో ఉత్పత్తులు కొనుగోలు చేసే వినియోగదారులు కూపన్ వల్ల ఉత్పత్తులపై డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల తమ డబ్బును కొంత పొదుపు చేసుకోవచ్చు. కొన్ని సైట్లలో ఫ్రీ కూపన్స్ కూడా లభిస్తాయి. కూపన్స్ ఉపయోగించడం వల్ల ఉత్పత్తులపై అధిక మొత్తంలో డిస్కౌంట్‌ను పొందే వీలుంటుంది.
ఆన్‌లైన్ కూపన్స్ కావాలంటే మీరు coupons.oneindia.com లాంటి సైట్లను సంప్రదించి మీరు కొనుగోలు చేసే వివిధ ఉత్పత్తులపై డిస్కౌంట్ పొంది మీ డబ్బును పొదుపు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ కూపన్స్ మీ ఈ మెయిల్ ఐడికి గానీ, సోషల్ మీడియా ద్వారా గానీ అందజేయబడతాయి.

ఉపయోగపడే కూపన్స్ లేదా డీల్స్ పొందడమెలా?

వంట సరుకులు, దుస్తులు, ఎలక్ట్రానిక్స్ మొదలైన వస్తువులపై అనేక వెబ్‌సైట్లు ఆన్‌లైన్ కూపన్స్ అందిస్తున్నాయి. ఈ కూపన్లను మీరు ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేసుకునే సమయంలో ఉపయోగించవచ్చు. మీరు కూపన్లు ఉపయోగించి చాలా సులభంగా తక్కువ ధరకే వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. నిత్యావసర, ఇతర వస్తువులు, ఆన్‌లైన్ టికెటింగ్ లాంటి అనేక రకాలైన సేవలు, ఉత్పత్తులపై మీరు మీ డబ్బును పొదుపు చేసుకోవచ్చు. coupons.oneindia.com లాంటి సైట్లు వివిధ వెబ్‌సైట్ల నుంచి, వివిధ రకాల ఉత్పత్తులపై కూపన్స్ అందజేస్తున్నాయి.

ఆన్‌లైన్ కూపన్లు పొందేందుకు అనేక మార్గాలున్నాయి. వాటిలో కొన్ని..

1. ఏదైన ఒక ఉత్పత్తి గురించి, ప్రత్యేక కూపన్ గురించి తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చ్‌లో వెతకండి.
2. coupons.oneindia.com, cuponation.in, couponraja.com and coupondunia.com లాంటి సైట్లను సంప్రదించండి.
3. ఈ కూపన్లను వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ద్వారా కూడా పొందవచ్చు.
4. న్యూస్ లెటర్ కోసం మీరు సైన్-అప్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా కొత్త డీల్స్, డిస్కౌంట్స్ మీరు పొందవచ్చు.

ఆన్‌లైన్ షాపింగ్‌లో కూపన్ కోడ్స్ ఎలా ఉపయోగించాలి?

కూపన్స్ ఉపయోగించడం చాలా సులభం. కూపన్లు కొన్ని ఉపయోగించే మార్గాలు..

1. కూపన్స్ పొందడం: కూపన్ వెబ్‌సైట్ల, ఆన్‌లైన్ స్టోర్ వెబ్‌సైట్లను సంప్రదించడం ద్వారా మీరు కూపన్స్ పొందవచ్చు.

2. కూపన్ కోడ్‌ను కాపీ చేసి పెస్ట్ చేయండి: కూపన్ కోడ్ లభించిన తర్వాత ఆ కోడ్‌ను కాపీ చేసి వస్తువులు కొనుగోలు చేసే వెబ్‌సైట్లో జాగ్రత్తగా పేస్ట్ చేయాలి.

3. కూపన్స్ కాల పరిమితి ముగిసిందా లేదా అనే అంశాలను వస్తువులను కొనుగోలు చేసేముందు పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది.

4. ఎంటర్ కూపన్ కోడ్: కూపన్ కోడ్ అని రాసివున్న ప్లేస్‌లో అంతకుముందు కాపీ చేసిన కోడ్‌ను పేస్ట్ చేసి వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

5. కూపన్‌ను సరిచూసుకోవాలి: ఆన్‌లైన్ షాపింగ్ చేసే ముందు మరోసారి కూపన్‌ను పరిశీలించుకోవాలి. మీరు కొనుగోలు చేసిన వస్తువుపై కూపన్ డిస్కౌంట్ ఇచ్చినట్లు చూపకపోతే సదరు వెబ్‌సైట్‌ను మీ కూపన్ వివరాల ద్వారా సంప్రదించవచ్చు.

నోట్: చాలా కూపన్లు ఒక పరిమితమైన ఉత్పత్తికి సంబంధించినవిగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా కొనుగోలు చేయాలనుకునే వారు ఇతర వస్తువల కూపన్ కోడ్‌ను పొందాల్సి ఉంటుంది.

మీకు మరేమైనా సందేహాలు ఉన్నట్లయితే..
Facebook: https://www.facebook.com/couponsoneindia
Twitter: https://twitter.com/CouponsOneindia
Google+ : https://plus.google.com/105686725958154567635/posts సంప్రదించవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+