హైదరాబాద్: ఐటి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనువైన కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతామని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతులు, బాధ్యతాయుతమైన పాలన, విద్యార్థుల్లో నైపుణ్య పెంపుతో ఐటి, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌ను దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ హబ్‌గా, వైఫై నగరంగా మారుస్తామని తెలిపారు.
శుక్రవారం హోటల్ తాజ్‌కృష్ణలో ఐటి కంపెనీల అధిపతులు, ప్రతినిధులతో కెటిఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైస్ అసోసియేషన్, నాస్కామ్, హైదరాబాద్ అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియాలతో పాటు పలు సంస్థలు సమావేశంలో పాల్గొన్నాయి. 70వేల కోట్ల రూపాయల విలువైన ఐటి పరిశ్రమకు హైదరాబాద్‌లో అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం ఉందని ఐటి కంపెనీల ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఐటి రంగంలో దేశానికే రాజధానిగా హైదరాబాద్ నిలిచే విధంగా మౌలిక వసతులు, నగర అభివృద్ధి ఉండాలని కోరారు.
బ్రాండ్ హైదరాబాద్ పేరు నిలబెట్టాలని ఐటి సంస్థలు నిర్ణయించాయ. ఐటి పరిశ్రమలకు హైదరాబాద్‌లో ఉన్న సౌకర్యాల గురించి తారక రామారావు ఐటి కంపెనీల యజమానులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఐటి ఎగుమతుల్లో దేశంలో తెలంగాణ రాష్ట్రం నాలుగవ స్థానంలో ఉందని, మొదటి స్థానానికి చేర్చాలని కోరారు. గడిచిన ఐదేళ్లలో హైదరాబాద్‌లో ఐటి ప్రగతి మందగించడానికి తెలంగాణ ఉద్యమం కారణం కాదని , ఆర్థిక మాంద్యంతో పాటు అనేక కారణాలు ఉన్నాయని అన్నారు.

సమావేశంలో మాట్లాడుతూ..
ఐటి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనువైన కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతామని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు.

ప్రతినిధులతో..
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతులు, బాధ్యతాయుతమైన పాలన, విద్యార్థుల్లో నైపుణ్య పెంపుతో ఐటి, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌ను దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ హబ్‌గా, వైఫై నగరంగా మారుస్తామని తెలిపారు.

ప్రతినిధులతో..
శుక్రవారం హోటల్ తాజ్‌కృష్ణలో ఐటి కంపెనీల అధిపతులు, ప్రతినిధులతో కెటిఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌ను దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ హబ్‌గా, వైఫై నగరంగా మారుస్తామని తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతూ..
తెలంగాణలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందని, పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని కెటిఆర్ చెప్పారు. ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, ప్రభుత్వం నుంచి ఐటి పరిశ్రమకు పూర్తి మద్దతు ఉంటుందని పెట్టుబడులు పెట్టాలని కోరారు.
తెలంగాణలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందని, పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని చెప్పారు. ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, ప్రభుత్వం నుంచి ఐటి పరిశ్రమకు పూర్తి మద్దతు ఉంటుందని పెట్టుబడులు పెట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఐటి అభివృద్ధికి తగిన కృషి చేయనున్నట్టు కెటిఆర్ తెలిపారు. గ్రామ స్థాయిలో ఐటి సేవలు అందించనున్నట్టు చెప్పారు. నగరంలో త్వరలోనే 4 జీ సేవలు అందుబాటులోకి రానున్నట్టు వివరించారు.
మరోవైపు 2017 వరకు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సమస్యను పూర్తిగా అధిగమిస్తుందని, అదనపు విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కెటిఆర్ చెప్పారు. అవసరమైతే ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామని చెప్పారు. ఐటి సంస్థలకు భద్రత, విద్యుత్, నీరు, ఇతర అన్ని సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కెటిఆర్ తోపాటు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్, ఐటి కార్యదర్శి హర్ ప్రీత్ సింగ్, హెచ్ఎండిఏ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, జలమండలి ఎండి జగదీశ్వర్, సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్, ఇట్స్ ఏపి అధ్యక్షుడు రమేష్ లోగనాథన్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications