హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని కంపెనీల రిజిస్ట్రార్ కార్యాలయం(ఆర్ఓసి) పరిధిలో నమోదైన కంపెనీలకు కొత్త ‘సిన్' నెంబర్లు జారీ చేశారు. హైదరాబాద్ ఆర్ఓసి పరిధిలో నమోదైన కంపెనీలు దాదాపు 93,000 ఉన్నాయి. ఈ కంపెనీలన్నింటినీ వాటి నమోదిత కార్యాలయం చిరునామా ఆధారంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కంపెనీలుగా విడదీసి కొత్త సిన్ నెంబర్ (కంపెనీల నమోదు నెంబరు) జారీ చేసే ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
సిన్ నెంబరు అంకెలు, ఇంగ్లీష్ అక్షరాలతో కూడి ఉంటుంది. ఈ నెంబరు మధ్యలో ఒకచోట తెలంగాణా రాష్ట్రానికి చెందిన కంపెనీ అయితే టిజి అని, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన కంపెనీ అయితే మధ్యలో ఏపి అని ఇంగ్లీష్ అక్షరాలు ఉండే విధంగా సిన్ నెంబరు జారీ చేశారు.

ఈ నెంబరు ప్రక్రియలో ఏమైనా లోటుపాట్లు చోటుచేసుకుంటే వాటిని సవరించడానికి ఆర్ఓసిలో అసిస్టెంట్ ఆర్ఓసి వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో ఒక ప్రత్యేక విభాగాన్ని (స్పెషల్ సెల్) నెలకొల్పారు.
రెండు రోజుల నుంచి ఈ సెల్ పని చేయడం ప్రారంభించింది. సిన్ నెంబరు విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సంబందిత కంపెనీ ఈ సెల్‌ను సంప్రదించాలని వెంకట్రామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 040-24606972 ఫోన్ నెంబరులోనూ సంప్రదించి తమ అభ్యంతరాన్ని నమోదు చేసుకోవచ్చని చెప్పారు.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

పేదలకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్.. ఈ ఏడాది చివరినాటికి మరో 4.5 లక్షల ఇళ్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications