హైదరాబాద్: వైమానిక సెజ్‌లో మరో కొత్త పరిశ్రమ ఏర్పాటు కానుంది. సోమవారం ఉదయం రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో విమాన పరికరాల తయారీ పరిశ్రమకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు హైటెక్స్‌లో శంకుస్థాపన చేశారు. టాటా, రుయాక్ సంస్థల జాయింట్ ప్రాజెక్టుగా ఈ పరిశ్రమ రూపకల్పన జరుగనుంది. రూ.500 కోట్ల వ్యయంతో డార్నియర్ విమాన పరికరాల పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు.
ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో ప్రధాన విభాగంతో పాటు రెక్కల తయారీని ప్రారంభిచనున్నారు. రెండో దశలో మొత్తం విమానం తయారుకానుంది. ఏరోస్పేస్ టెక్నాలజీ అభివృద్ధి హైదరాబాద్ వేదిక అవుతుందని, పరిశ్రమల అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని అమలు చేయనున్నట్లు కెసిఆర్ చెప్పారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలోనే సింగిల్ విండో కార్యాలయం ఉంటుందన్నారు. పారిశ్రామిక వేత్తలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని వెల్లడించారు. టాటా గ్రూప్ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పారు.

విమాన పరికరాల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన
సోమవారం ఉదయం రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో విమాన పరికరాల తయారీ పరిశ్రమకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు హైటెక్స్‌లో శంకుస్థాపన చేశారు.

జాయింట్ ప్రాజెక్టు
టాటా, రుయాక్ సంస్థల జాయింట్ ప్రాజెక్టుగా ఈ పరిశ్రమ రూపకల్పన జరుగనుంది. రూ.500 కోట్ల వ్యయంతో డార్నియర్ విమాన పరికరాల పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు.

హైదరాబాద్ వేదిక
ఏరోస్పేస్ టెక్నాలజీ అభివృద్ధి హైదరాబాద్ వేదిక అవుతుందని, పరిశ్రమల అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని అమలు చేయనున్నట్లు కెసిఆర్ చెప్పారు.

సింగిల్ విండో
ముఖ్యమంత్రి కార్యాలయంలోనే సింగిల్ విండో కార్యాలయం ఉంటుందన్నారు. పారిశ్రామిక వేత్తలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని వెల్లడించారు. టాటా గ్రూప్ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పారు.

కొత్త పారిశ్రామిక విధానం
సిఐఐ, ఫ్యాఫ్సీ, ఎంఎస్ఎంఇ వంటి పారిశ్రామిక సంఘాలతో చర్చించి త్వరలో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని కెసిఆర్ చెప్పారు.

మేడ్ ఇన్ తెలంగాణ
మేడ్ ఇన్ తెలంగాణ లేబల్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆయన రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
సిఐఐ, ఫ్యాఫ్సీ, ఎంఎస్ఎంఇ వంటి పారిశ్రామిక సంఘాలతో చర్చించి త్వరలో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని కెసిఆర్ చెప్పారు. మేడ్ ఇన్ తెలంగాణ లేబల్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆయన రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలో డిఆర్‌డివో, డిఆర్‌డిఎల్, మిథానీ, బిడిఎల్, రిసెర్చ్ సెంట్ ఇమారత్, బిఇఎల్, హెచ్ఎఎల్ వంటి పలు పరిశోధనా సంస్థలు హైదరాబాదులో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు ఇది పరికరాల తయారీదారులు, ఏరో స్పేస్ టెక్నాలజీ పరిశోధకులు కలిసి పనిచేయడానికి అవకాశం కల్పిస్తుందని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications