పారిశ్రామికాభివృద్ధిపై బాబు సమీక్ష(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామికీకరణ సాధించేందుకు కలిసి పనిచేద్దామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్షించారు. రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనే అంశాలపై చర్చించారు. గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్‌ను కూడా ఈ భేటీకి ఆహ్వానించిన చంద్రబాబు పలు అంశాలపై కీలకంగా చర్చించారు.
ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు పారిశ్రామికీకరణను సమానంగా వర్తింపచేయాలన్న భావంతో ఆ దిశగా చర్చించినట్లు తెలిసింది. రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు వచ్చేలా చూడాల్సిన బాధ్యత, అవసరం అందరిపైనా ఉందని, దీనికి అంతా సహకరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పరిశ్రమల అభివృద్ధి కోసం రాష్ట్రంలో పది ప్రాంతాలను గుర్తించినట్లు ఆయన వివరించారు. ఈ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సిఐఐ ప్రతినిధులు విజ్ఞప్తిచేశారు.

చంద్రబాబు సమీక్ష
రాష్ట్రంలో పారిశ్రామికీకరణ సాధించేందుకు కలిసి పనిచేద్దామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

చంద్రబాబు సమీక్ష
శుక్రవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు, అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్‌ను కూడా ఈ భేటీకి ఆహ్వానించిన చంద్రబాబు పలు అంశాలపై కీలకంగా చర్చించారు.

చంద్రబాబు సమీక్ష
ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు పారిశ్రామికీకరణను సమానంగా వర్తింపచేయాలన్న భావంతో ఆ దిశగా చర్చించినట్లు తెలిసింది.

చంద్రబాబు సమీక్ష
రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు వచ్చేలా చూడాల్సిన బాధ్యత, అవసరం అందరిపైనా ఉందని, దీనికి అంతా సహకరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు సమీక్ష
పరిశ్రమల అభివృద్ధి కోసం రాష్ట్రంలో పది ప్రాంతాలను గుర్తించినట్లు ఆయన వివరించారు. ఈ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సిఐఐ ప్రతినిధులు విజ్ఞప్తిచేశారు.

చంద్రబాబు సమీక్ష
పరిశ్రమల అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని, మాన్యుఫాక్చరింగ్ యూనిట్లపై దృష్టి పెట్టాలని సిఎం చంద్రబాబు సమాఖ్య ప్రతినిధులకు సూచించారు.
పరిశ్రమల అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని, మాన్యుఫాక్చరింగ్ యూనిట్లపై దృష్టి పెట్టాలని సిఎం చంద్రబాబు సమాఖ్య ప్రతినిధులకు సూచించారు. అలాగే విజయవాడలో పారిశ్రామిక సమ్మిట్‌ను నిర్వహించాలని భారత పరిశ్రమల సమాఖ్యకు సూచించారు.
యువ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించడం, ప్రోత్సహించడంతోపాటు, పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలా చూసేందుకు కూడా చంద్రబాబు చర్చించారు. ఇది ఇలా ఉండగా, తన కుమారుడు లోకేష్‌ను, యువ పారిశ్రామిక వేత్త జయదేవ్‌లను కూడా పారిశ్రామికీకరణలో వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు సమావేశంలో కొన్ని అంశాలపై నిశితంగా చర్చించినట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications