హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాల్లో ఔత్సాహిక పారిశ్రామికులకు అవసరమైన ప్రాథమిక ఆర్థిక సహాయం అందించేందుకు టెక్నాలజీ డెవలప్‌మెంట్ బ్యాంక్ (టిడిబి) ఏర్పాటు చేసే యోచన ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఇండియా గాడ్జెట్ ఎక్స్‌పో-2014ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
హైదరాబాద్ ఇప్పటికే సాఫ్ట్‌వేర్ రంగంలో తన సత్తా చాటుకున్నదని, భవిష్యత్తులో హార్డ్‌వేర్ హబ్‌గా అభివృద్ధి కావాలంటే ఔత్సాహిక పారిశ్రామికులకు అవసరమైన ప్రారంభ మూలధనం కోసం ఒక గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేయాలని కెటిఆర్‌కు ప్రముఖ ఐటి రంగ నిపుణుడు జె.ఎ.చౌదరి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పట్టభద్రులను పరిశ్రమ అవసరాలకు సరిపోయే మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని, అలాగే హైదరాబాద్‌లో తయారవుతున్నచిప్‌ల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఐటిఐఆర్‌లో కామన్ టెస్టింగ్ కేంద్రం ఒకటి ఏర్పాటు చేయాలని మంత్రి కెటిఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఈ మూడు చర్యలు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగంలో కార్యకలాపాలు ప్రారంభించాలని ఉత్సాహపడుతున్న పారిశ్రామికులు, ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న చిన్న పరిశ్రమలకు సహాయకారిగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అందుకు మంత్రి కెటిఆర్ సానుకూలంగా స్పందిస్తూ ఔత్సాహిక పారిశ్రామికులకు అండదండలు అందించేందుకు టిడిబి ఏర్పాటు చేసే విషయం ప్రభుత్వం పరిశీలిస్తున్నదని, ప్రస్తుతం ఐటి శాఖ అధికారులు దానికి సంబంధించిన విధివిధానాలు తయారుచేసే పనిలో ఉన్నారని కెటిఆర్ వివరించారు.
హైదరాబాద్, దాని చుట్టుపక్కల పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహిక ఐటి పారిశ్రామికులకు అవసరమైన ప్రారంభ మూలధనాన్ని ఈ బ్యాంక్ అందిస్తుందని కెటిఆర్ తెలిపారు. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో దేశంలోనే అతి పెద్ద ఇంకుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు తాము ఇప్పటికే ప్రకటించామని, ఆరు నెలల్లో అది పని ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు.
ఐటి రంగానికి అవసరమైన సుశిక్షితులైన మానవ వనరులను అందించేందుకు సాఫ్ట్‌వేర్ రంగంలోకి ప్రధాన కంపెనీలతో ఒక కన్సార్షియం ఏర్పాటు చేయాలనుకుంటున్నామని అన్నారు. ఈ కన్సార్షి యం ఇంజనీరింగ్ కళాశాలలను దత్తత తీసుకుని ఆయా కళాశాలలకు చెందిన విద్యార్థులను పరిశ్రమకు అవసరం అయిన మానవ వనరులుగా తీర్చి దిద్దుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హైటెక్స్ సిఓఓ నాగేంద్రప్రసాద్, ఎస్‌కె ఇన్నోవెంచర్స్ సిఈఓ సంజీవ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
హార్డ్‌వేర్ హబ్‌గా హైదరాబాద్
సాఫ్ట్‌వేర్‌లో భారత్‌లోనే రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ను హార్డ్‌వేర్ హబ్‌గా కూడా అభివృద్ధి చేసే లక్ష్యంతో హార్డ్‌వేర్ పాలసీ ఒకటి త్వరలో ప్రకటించనున్నట్టు కెటిఆర్ తెలిపారు. దీని వివరాలు కూడా త్వరలో ప్రకటిస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చి ఇంకా 16 రోజులే అయినందు వల్ల అనుకున్నవన్నీ కార్యరూపం దాల్చడానికి కొంత వ్యవధి పడుతుందని ఆయన అన్నారు. శంషాబాద్ సమీపంలోని మహేశ్వరంలో రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటు కానున్నాయని, వాటికి కేంద్రం ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు. ఆ కేంద్రాల ఏర్పాటు వ్యయంలో 50 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.

గాడ్జెట్ ఎక్స్‌పో
తెలంగాణ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాల్లో ఔత్సాహిక పారిశ్రామికులకు అవసరమైన ప్రాథమిక ఆర్థిక సహాయం అందించేందుకు టెక్నాలజీ డెవలప్‌మెంట్ బ్యాంక్ (టిడిబి) ఏర్పాటు చేసే యోచన ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు.

గాడ్జెట్ ఎక్స్‌పో
గురువారం హైదరాబాద్‌లో ఇండియా గాడ్జెట్ ఎక్స్‌పో-2014ను ప్రారంభించిన సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు.

గాడ్జెట్ ఎక్స్‌పో
హైదరాబాద్ ఇప్పటికే సాఫ్ట్‌వేర్ రంగంలో తన సత్తా చాటుకున్నదని, భవిష్యత్తులో హార్డ్‌వేర్ హబ్‌గా అభివృద్ధి కావాలంటే ఔత్సాహిక పారిశ్రామికులకు అవసరమైన ప్రారంభ మూలధనం కోసం ఒక గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేయాలని కెటిఆర్‌కు ప్రముఖ ఐటి రంగ నిపుణుడు జె.ఎ.చౌదరి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

గాడ్జెట్ ఎక్స్‌పో
అదేవిధంగా పట్టభద్రులను పరిశ్రమ అవసరాలకు సరిపోయే మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని, అలాగే హైదరాబాద్‌లో తయారవుతున్నచిప్‌ల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఐటిఐఆర్‌లో కామన్ టెస్టింగ్ కేంద్రం ఒకటి ఏర్పాటు చేయాలని మంత్రి కెటిఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

గాడ్జెట్ ఎక్స్‌పో
ఈ మూడు చర్యలు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగంలో కార్యకలాపాలు ప్రారంభించాలని ఉత్సాహపడుతున్న పారిశ్రామికులు, ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న చిన్న పరిశ్రమలకు సహాయకారిగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

గాడ్జెట్ ఎక్స్‌పో
అందుకు మంత్రి కెటిఆర్ సానుకూలంగా స్పందిస్తూ ఔత్సాహిక పారిశ్రామికులకు అండదండలు అందించేందుకు టిడిబి ఏర్పాటు చేసే విషయం ప్రభుత్వం పరిశీలిస్తున్నదని, ప్రస్తుతం ఐటి శాఖ అధికారులు దానికి సంబంధించిన విధివిధానాలు తయారుచేసే పనిలో ఉన్నారని కెటిఆర్ వివరించారు.

గాడ్జెట్ ఎక్స్‌పో
హైదరాబాద్, దాని చుట్టుపక్కల పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహిక ఐటి పారిశ్రామికులకు అవసరమైన ప్రారంభ మూలధనాన్ని ఈ బ్యాంక్ అందిస్తుందని కెటిఆర్ తెలిపారు. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

గాడ్జెట్ ఎక్స్‌పో
హైదరాబాద్‌లో దేశంలోనే అతి పెద్ద ఇంకుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు తాము ఇప్పటికే ప్రకటించామని, ఆరు నెలల్లో అది పని ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు.

గాడ్జెట్ ఎక్స్‌పో
ఐటి రంగానికి అవసరమైన సుశిక్షితులైన మానవ వనరులను అందించేందుకు సాఫ్ట్‌వేర్ రంగంలోకి ప్రధాన కంపెనీలతో ఒక కన్సార్షియం ఏర్పాటు చేయాలనుకుంటున్నామని కెటిఆర్ అన్నారు.

గాడ్జెట్ ఎక్స్‌పో
ఈ కన్సార్షి యం ఇంజనీరింగ్ కళాశాలలను దత్తత తీసుకుని ఆయా కళాశాలలకు చెందిన విద్యార్థులను పరిశ్రమకు అవసరం అయిన మానవ వనరులుగా తీర్చి దిద్దుతుందని ఆయన తెలిపారు.

గాడ్జెట్ ఎక్స్‌పో
గాడ్జెట్ ఎక్స్‌పోలో హైటెక్స్ సిఓఓ నాగేంద్రప్రసాద్, ఎస్‌కె ఇన్నోవెంచర్స్ సిఈఓ సంజీవ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

గాడ్జెట్ ఎక్స్‌పో
సాఫ్ట్‌వేర్‌లో భారత్‌లోనే రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ను హార్డ్‌వేర్ హబ్‌గా కూడా అభివృద్ధి చేసే లక్ష్యంతో హార్డ్‌వేర్ పాలసీ ఒకటి త్వరలో ప్రకటించనున్నట్టు కెటిఆర్ తెలిపారు.

గాడ్జెట్ ఎక్స్‌పో
హార్డ్‌వేర్ పాలసీ వివరాలు కూడా త్వరలో ప్రకటిస్తామని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు.

గాడ్జెట్ ఎక్స్‌పో
తాము అధికారంలోకి వచ్చి ఇంకా 16 రోజులే అయినందు వల్ల అనుకున్నవన్నీ కార్యరూపం దాల్చడానికి కొంత వ్యవధి పడుతుందని కెటిఆర్ అన్నారు.

గాడ్జెట్ ఎక్స్‌పో
శంషాబాద్ సమీపంలోని మహేశ్వరంలో రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటు కానున్నాయని, వాటికి కేంద్రం ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

New Rules: తెలంగాణ డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్! ఇకపై అది ఉంటేనే లైసెన్స్!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications