హైదరాబాద్‌లో ఇమాజికా థీమ్ పార్క్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అమ్యూజ్‌మెంట్ పార్క్ రానుంది. ఇందులో రెస్టారెంట్లు, రోలర్ కోస్టర్ రైడ్స్, వాటర్ పార్కు, హోటళ్లు ఉంటాయి. ఈ పార్కు వినోదాన్ని, ఆహార రుచులను అందిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంపై యాడ్‌ల్యాబ్ అభివృద్ధి చేసిన ఇమాజికాతో చర్చలు జరుపుతోంది. హైదరాబాదులో షాప్ పెట్టే విషయంపై ఆ చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వన్ - స్టాప్ థీమ్ పార్క్ హైదరాబాదులో లేదు.

ఇమాజికా ముంబై - పూణే ఎక్స్‌ప్రెస్ వైపే గల ఖోపోలీలో అమ్యూజ్‌మెంట్ పార్కును ఏర్పాటు చేసింది. ఇది 300 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది అంతర్జాతీయ స్థాయి అమ్యూజ్‌మెంట్ పార్కు
ఇందులో రెస్టారెంట్లు, వాటర్ పార్కు, ఇతర 26 రకాల ఆకర్షణలు, జోన్స్‌తో ఆప్రికా, ఐరోపా, ఆరేబియా, భారత్, ఆసియా, అమెరికాలను ప్రతిబింబిస్తుంది.


Click it and Unblock the Notifications