భారత ఐటికి చైనాతో ముప్పులేదు: ఇన్ఫోసిస్

China no threat to Indian IT: Infosys
బీజింగ్: పొరుగు దేశం చైనాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటి రంగంతో భారతీయ ఐటి రంగానికి వచ్చిన ముప్పేమి లేదని దేశీయ ఐటిరంగ దిగ్గజం ఇన్ఫోసిస్ అభిప్రాయపడింది. చైనాలోని ఇన్ఫోసిస్ సంస్థ సిఈఓగా వ్యవహరిస్తున్న రంగరాజన్ వెల్లమోరి సోమవారం పిటిఐతో మాట్లాడుతూ.. 100 బిలియన్ డాలర్ల భారతీయ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి చైనా నుంచి ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు.

భారతీయ ఐటి సంస్థలకు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న అమెరికాపై చైనా సంస్థలు ఇంకా దృష్టి పెట్టకపోవడమే దీనికి కారణమని ఆయన అన్నారు. అమెరికాలో చైనా సంస్థల ప్రభావం చాలా తక్కువగానే ఉందని రంగరాజన్ గుర్తుచేశారు. భారత ఐటి రంగానికి ప్రధానమైన అమెరికా మార్కెట్‌లో చైనాకు చెందిన సంస్థలు పెట్టుబడులు పెట్టడం లేదన్నారు.

చైనా ఐటి రంగ సంస్థలు స్వదేశంలో ఎదగడంపైనే ప్రస్తుతం దృష్టి పెట్టాయన్న రంగరాజన్, భారతీయ ఐటి రంగ ఔట్‌సోర్సింగ్‌కు ప్రభుత్వ సాయం ఇప్పుడే అక్కర్లేదని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా వస్తున్న అభ్యర్థనలను ఆయన తోసిపుచ్చారు.

ఇక అమెరికా మార్కెట్‌తో పోల్చితే చైనా మార్కెట్ చాలా తక్కువదని, ఇక్కడ లాభాలూ తక్కువేనని, అందుకే చైనాపై భారతీయ ఐటి సంస్థలు ఆసక్తి కనబరచడం లేదని ఆయన పేర్కొన్నారు. అమెరికా మార్కెట్ విలువ 600 బిలియన్ డాలర్లుగా ఉందన్న రంగరాజన్.. 108 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఐటి రంగానికి అమెరికానే ప్రధాన ఆదాయ వనరని వెల్లడించారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా భారతీయ సంస్థలు ఎంతో బలంగా ఉన్నాయని, వినియోగదారుల ఆధారంగా చూస్తే మాత్రం చైనా సంస్థల మరింత బలమైనవని రంగరాజన్ పేర్కొన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+