శ్రీనగర్/హైదరాబాద్: భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే విత్త పరమైన క్రమశిక్షణ అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. వరుసగా రెండేళ్ల నుంచి వృద్ధి రేటు ఐదు శాతాని కంటే దిగువనే ఉందని, దీన్ని గాడిలో పెట్టాలంటే విధానపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రక్షణ శాఖ మంత్రిత్వ బాధ్యతలనూ నిర్వర్తిస్తున్న జైట్లీ భద్రతా సమీక్ష సమావేశాల కోసం కాశ్మీర్‌లో రెండు రోజులు పర్యటిస్తున్నారు.
ఆదివారం ఆయన మాట్లాడుతూ... విత్తపరమైన క్రమశిక్షణతోనే ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుందని, దీంతోనే ప్రజలకు లబ్ది చేకూరుతుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో సాగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతికూల నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ అంతా గందరగోళంగా మారుతుందని జైట్లీ పేర్కొన్నారు. రెండేళ్లుగా వృద్ధి రేటు దశాబ్దపు కనిష్ఠ స్థాయిలకు పడిపోగా ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలకు చేరుకుందని తెలిపారు.
ఇదే సమయంలో పన్ను వసూళ్లు తగ్గిపోయాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని బడ్జెట్‌లో ఇందుకు సంబంధించిన ప్రకటనలుంటాయని ఆయన చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలోకి తీసుకురావాలంటే వచ్చే రెండు మూడేళ్లలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే వెల్లడించారు.

చైనాకు ఎగుమతులు: నిర్మల
పొరుగు దేశం చైనాకు ఎగుమతులు చేసేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించాలని పరిశ్రమ వర్గాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. శనివారం రాత్రి ఫిక్కీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె చైనా ఉత్పత్తులు ఎందుకు భారతీయ మార్కెట్ లోలోపలికి ప్రవేశించగలిగాయన్నారు. అయితే ఈ సందర్భంగా భారత్‌కు దిగుమతి అవుతున్న చైనా ఉత్పత్తులపై నిషేధం విధించాలని కార్యక్రమంలో పాల్గొన్న ఒకరు ఆమెను కోరారు.
గణేష్ ప్రతిమలు, ఎల్‌ఇడి బల్బులు, క్రాకర్లు తదితర అన్ని ఉత్పత్తులు చైనా నుంచి దిగుమతి అవుతున్నాయని, వాటివల్ల తమ వ్యాపారం దెబ్బతింటోందన్న ఆందోళన వెలిబుచ్చారు. వాటి దిగుమతులను తప్పక నిషేధించాలన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఆ ఉత్పత్తులను ఆకర్షణీయంగా భారతీయ పరిశ్రమలు ఎందుకు తయారు చేయలేకపోతున్నాయన్నారు. మన దేవుడైన గణేషుడి ప్రతిమతోపాటు, ఎల్‌ఇడి బల్బులు, క్రాకర్లను ఇప్పుడు చైనా తయారు చేసినట్లుగా తయారు చేయాలనే ఆలోచన మీకెందుకు రాలేదని ప్రశ్నించారు. కాబట్టి ఆ కోణంలో ఆలోచించి తిరిగి చైనాకే ఎగుమతులు చేసేలా ఎదగాలన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫ్యాప్సీ శాఖ
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆర్థిక వృద్ధే ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య(ఫ్యాప్సీ) లక్ష్యమని ఫ్యాప్సీ కొత్త అధ్యక్షుడు శివ్‌కుమార్ రూంగ్‌టా తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన సభ్యులు ఫ్యాప్సీలో ఉన్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధానిని నిర్ణయించాక, ఆ రాష్ట్ర అవసరాలు తీర్చేలా ఫ్యాప్సీ శాఖను అక్కడ ప్రారంభించాలనే యోచన ఉన్నట్లు తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2014-15కుగానూ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య (్ఫ్యప్సీ) అధ్యక్షుడిగా ప్రముఖ పారిశ్రామికవేత్త, రుంగ్టా గ్లాస్‌టెక్ మేనేజింగ్ డైరెక్టర్ శివకుమార్ రుంగ్టా ఆదివారం ఇక్కడ జరిగిన 97వ వార్షక సాధారణ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 2014-15కుగానూ ఫ్యాప్సీ సీనియర్ ఉపాధ్యక్షుడిగా ప్రముఖ పారిశ్రామికవేత్త ప్లాస్టిక్ ఇండస్ట్రీలో టెక్నికల్ డైరెక్టర్ వెన్నం అనిల్ రెడ్డి నియమితులయ్యారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications