హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, సాంకేతికంగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. ఆయన శుక్రవారం ‘రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా-9' సంస్థ ఆధ్వార్యాన నిర్వహించిన ‘హైదరాబాద్ ది రోడ్ ఎహెడ్' సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణలో పెట్టుబడులు, వ్యాపారాలకు అనువైన వాతావరణంపై ఆయన ప్రతినిధులతో చర్చించారు. ఐఎస్‌బి, ఐఐఐటిలతో కలిసి దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్(స్టార్టప్ సంస్థలు)ను ఏర్పాటు చేయనున్నట్లు కెటిఆర్ తెలిపారు. త్వరలోనే దీనికి తుది రూపం రానుందని తెలిపారు. హైదరాబాద్‌ను పూర్తి స్థాయి వై-ఫై నెట్‌వర్క్ నగరంగా తీర్చి దిద్దుతామన్నారు. ఇంజినీరింగ్,, డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగార్హతలు, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
సాఫ్ట్‌వేర్ సంస్థలు, ఇంజినీరింగ్ కళాశాలలను అనుసంధానం చేయడం ద్వారా, వారిలో నైపుణ్యాలను అభివృద్ధిపరచాలని యోచిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడిన వారికి అండగా నిలుస్తామని, హైదరాబాద్‌లో శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటామన్నారు. నైపుణ్యాలు అవసరం లేని(అన్‌స్కిల్డ్) ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం కల్పించాలని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా సంస్థలను కోరారు.
నైపుణ్యం అవసరమైన ఉద్యోగాల్లో ఏ ప్రాంతానికి చెందిన వారినైనా నియమించుకోవచ్చని, అందుకు ఎవరూ అడ్డు చెప్పరని అన్నారు. ఈ కార్యక్రమంలో రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా-9 సంస్థ ఛైర్మన్ ఫిరోజ్‌ఖాన్, సినీ నిర్మాత సురేష్ బాబు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

హైదరాబాద్ ది రోడ్ ఎహెడ్
పారిశ్రామికంగా, సాంకేతికంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు.

హైదరాబాద్ ది రోడ్ ఎహెడ్
శుక్రవారం ‘రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా-9' సంస్థ ఆధ్వార్యాన నిర్వహించిన ‘హైదరాబాద్ ది రోడ్ ఎహెడ్' సదస్సుకు కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

హైదరాబాద్ ది రోడ్ ఎహెడ్
తెలంగాణలో పెట్టుబడులు, వ్యాపారాలకు అనువైన వాతావరణంపై ఆయన ప్రతినిధులతో చర్చించారు. ఐఎస్‌బి, ఐఐఐటిలతో కలిసి దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్(స్టార్టప్ సంస్థలు)ను ఏర్పాటు చేయనున్నట్లు కెటిఆర్ తెలిపారు. త్వరలోనే దీనికి తుది రూపం రానుందని తెలిపారు.

హైదరాబాద్ ది రోడ్ ఎహెడ్
హైదరాబాద్‌ను పూర్తి స్థాయి వై-ఫై నెట్‌వర్క్ నగరంగా తీర్చి దిద్దుతామన్నారు. ఇంజినీరింగ్,, డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగార్హతలు, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
More From GoodReturns

తెలంగాణ నుంచి తిరుపతికి వేగవంతమైన కనెక్టివిటీ.. నకిరేకల్ - ఏర్పేడు NH-565 పూర్తిగా అందుబాటులోకి..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

ఇందిరమ్మ ఇళ్లుపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏప్రిల్‌లో రెండో విడత కార్యక్రమం..

మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్.. ఈ రంగాలకు కేటాయింపులు ఎక్కువగా జరిగే ఛాన్స్..

Hyderabad: రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఛాన్స్? బడ్జెట్ తర్వాత మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి?

Hyderabad: హైదరాబాద్ చుట్టూ రింగ్ రైలు.. కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!



Click it and Unblock the Notifications