అనంతపురం: శిల్పకళలకు నిలయమైన లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం అభివృద్ధికి నోచుకోకపోవడం పట్ల రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆవేదన వ్యక్తం చేశారు. లేపాక్షి శిల్సకళ అద్భుతమని కొనియాడారు. లేపాక్షిని పర్యాటక కేంద్రంగా మార్చడానికి కృషి చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన పూర్తైందని, అధికారుల విభజన ఇంకా పూర్తికాలేదని ఆయన తెలిపారు. ఈనెల 19నుంచి ఏపి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నట్లు గవర్నర్ తెలియజేశారు.
గురువారం ఆయన జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం, ఏకశిలా నంది విగ్రహాలను గవర్నర్ గురువారం సతీసమేతంగా సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 1971లో తాను ఐపిఎస్ అధికారిగా శిక్షణ పొందేందుకు అనంతపురం వచ్చినప్పుడు లేపాక్షి శిల్పకళా వైభవం, చరిత్ర గురించి తెలుసుకున్నానన్నారు. గవర్నర్ హోదాలో ఆలయాన్ని సందర్శించడం ఎంతో అదృష్టమన్నారు.
వీరభద్రస్వామి, దుర్గాదేవిల దర్శనంతో సౌభాగ్యం దక్కినట్లయిందన్నారు. లేపాక్షి ఆలయంలో శిల్పకళలు అద్భుతమన్నారు. లేపాక్షిలో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా పట్టుచీరలు తయారు చేయించి విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. శిల్పకళలు, నంది విగ్రహం, శివపార్వతుల అసంపూర్తి కళ్యాణమంటపం చరిత్ర, లతామంటపం, నాట్య మంటపం, డిజైన్లు, సీత పాదం, ఆలయ విశిష్టత గురించి పర్యాటకులకు గైడ్ల ద్వారా వివరిస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
లేపాక్షిని ప్రముఖ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని గవర్నర్ అన్నారు. లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయంలో ఇటీవల వినాయక విగ్రహం అపహరణకు గురికాగా అధికార యంత్రాంగం దాన్ని బయట పెట్టలేదని మీడియా గవర్నర్ దృష్టికి తీసుకురాగా దేవుని విగ్రహాన్ని ఎత్తుకెళ్ళడం మహాపాపమన్నారు. అదంతా దేవుడే చూసుకుంటారంటూ చెప్పారు. ఈ సమావేశంలో కలెక్టర్ లోకేష్‌కుమార్, దేవాదాయశాఖ సహాయ సంచాలకులు మల్లికార్జున పాల్గొన్నారు.

గవర్నర్ నర్సింహన్
శిల్పకళలకు నిలయమైన లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం అభివృద్ధికి నోచుకోకపోవడం పట్ల రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆవేదన వ్యక్తం చేశారు.

గవర్నర్ నర్సింహన్
లేపాక్షి శిల్సకళ అద్భుతమని కొనియాడారు. లేపాక్షిని పర్యాటక కేంద్రంగా మార్చడానికి కృషి చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు.

గవర్నర్ నర్సింహన్
గురువారం ఆయన జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం, ఏకశిలా నంది విగ్రహాలను గవర్నర్ గురువారం సందర్శించారు.

గవర్నర్ నర్సింహన్
ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 1971లో తాను ఐపిఎస్ అధికారిగా శిక్షణ పొందేందుకు అనంతపురం వచ్చినప్పుడు లేపాక్షి శిల్పకళా వైభవం, చరిత్ర గురించి తెలుసుకున్నానన్నారు.

గవర్నర్ నర్సింహన్
గవర్నర్ హోదాలో లేపాక్షి ఆలయాన్ని సందర్శించడం ఎంతో అదృష్టమని నర్సింహన్ అన్నారు.

గవర్నర్ నర్సింహన్
వీరభద్రస్వామి, దుర్గాదేవిల దర్శనంతో సౌభాగ్యం దక్కినట్లయిందన్నారు. లేపాక్షి ఆలయంలో శిల్పకళలు అద్భుతమన్నారు.

గవర్నర్ నర్సింహన్
లేపాక్షిలో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా పట్టుచీరలు తయారు చేయించి విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

గవర్నర్ నర్సింహన్
శిల్పకళలు, నంది విగ్రహం, శివపార్వతుల అసంపూర్తి కళ్యాణమంటపం చరిత్ర, లతామంటపం, నాట్య మంటపం, డిజైన్లు, సీత పాదం, ఆలయ విశిష్టత గురించి పర్యాటకులకు గైడ్ల ద్వారా వివరిస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

గవర్నర్ నర్సింహన్
లేపాక్షిని ప్రముఖ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని గవర్నర్ అన్నారు.

గవర్నర్ నర్సింహన్
లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయంలో ఇటీవల వినాయక విగ్రహం అపహరణకు గురికాగా అధికార యంత్రాంగం దాన్ని బయట పెట్టలేదని మీడియా గవర్నర్ దృష్టికి తీసుకురాగా దేవుని విగ్రహాన్ని ఎత్తుకెళ్ళడం మహాపాపమన్నారు.

గవర్నర్ నర్సింహన్
లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన గవర్నర్ నర్సింహన్ వెంట కలెక్టర్ లోకేష్‌కుమార్, దేవాదాయశాఖ సహాయ సంచాలకులు మల్లికార్జున పాల్గొన్నారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications