హైదరాబాద్: నలుమూలాల విస్తరిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రోజురోజుకు పెరిగిపోతున్న గాడ్జెట్ల వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ఎల్‌అండ్‌టి ఇన్ఫోసిటీ.. హైదరాబాద్‌లో తొలి గాడ్జెట్ ఎక్స్‌పోను నిర్వహిస్తోంది. జూన్ 19 నుంచి నాలుగు రోజుల పాటు ఈ ఎక్స్‌పో జరుగుతుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కెవి నాగేంద్రప్రసాద్ మంగళవారం ఈ విషయం ప్రకటించారు.
తొలి రెండు రోజులు సూపర్ సెమినార్ ఉంటుందని, ఆ తర్వాత రెండు రోజులు ఎగ్జిబిషన్ ఉంటుందని చెప్పారు. ఎగ్జిబిషన్‌కు అందరికీ ప్రవేశం ఉచితమేనని ఆయన తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ గాడ్జెట్ తయారీ సంస్థలతో పాటు ఎలక్ట్రానిక్ ఉత్పత్తి కంపెనీలు, మొబైల్ కంపెనీల ప్రతినిధులు కూడా ఈ సెమినార్లలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

మొబైల్ అప్లికేషన్లు, గేమింగ్ వంటి విభాగాల్లో ఇప్పుడిప్పుడే ప్రవేశించిన స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో అలాంటి కంపెనీలకు ఎగ్జిబిషన్ స్థలం ఉచితంగా ఇస్తున్నట్లు ఆయన వివరించారు.
బ్లూ స్టార్ బోర్డులోకి శోభనా కామినేని
ఎయిర్ కండీషనింగ్ సంస్థ బ్లూ స్టార్ లిమిటెడ్ అదనపు డైరెక్టర్‌గా శోభనా కామినేని నియమితులయ్యారు. మే 30 నుంచి ఈమె నియామకం అమల్లోకి వచ్చిందని బ్లూ స్టార్ ఓ ప్రకటనలో తెలిపింది. శోభనా కామినేనికి వృత్తిపరంగా ఉన్న అపారమైన అనుభవం తమకు ఎంతగానో కలిసివస్తుందని సంస్థ పేర్కొంది.
శోభనా కామినేని ఆర్ఢిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌తో పాటు అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి హాస్పిటల్ అడ్మిస్ట్రేషన్‌లో డిప్లొమాను పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె అపోలో హాస్పిటల్ గ్రూప్‌లో సభ్యురాలిగా ఉన్నారు. అపోలో ఫార్మసీని దేశవ్యాప్తంగా విస్తరించటంతో పాటు 2008లో మ్యూనిచ్ రేతో కలిసి అపోలో గ్రూప్ బీమా రంగంలోకి అడుగుపెట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
More From GoodReturns

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications