న్యూఢిల్లీ: దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడికి ఫోన్‌లో మాట్లాడినా ఒకే రేటు చెల్లించే సదుపాయాన్ని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కల్పించింది. సోమవారం ‘వన్ ఇండియా వన్ రేట్' పేరుతో కొత్త రోమింగ్ ప్లాన్‌ను ఆర్‌కాం ప్రారంభించింది. దీంతో ఇకపై ఆర్‌కామ్ వినియోగదారులు దేశవ్యాప్తంగా లోక్‌ల్, ఎస్‌టిడితోపాటు ఎక్కడి నుంచైనా రోమింగ్ కాల్స్‌కు ఒకే ధరను చెల్లించనున్నారు.
వన్ ఇండియా వన్ రేట్‌లో భాగంగా రూ. 599, రూ. 350లలో వేర్వేరుగా 2 ప్లాన్లను పోస్ట్-పెయిడ్ వినియోగదారుల కోసం ప్రవేశపెట్టిన ఆర్‌కామ్.. ప్రీ-పెయిడ్ కస్టమర్ల కోసం రూ. 45 ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. దేశంలో వన్ ఇండియా వన్ రేట్ ప్లాన్లను ప్రారంభిస్తున్నందుకు తాము ఆనందిస్తున్నామని రిలయన్స్ కమ్యునికేషన్స్ కన్జ్యూమర్ బిజినెస్ సిఈఓ గుర్దీప్ సింగ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. దీనివల్ల రోమింగ్, ఎస్‌టిడి, లోకల్ కాల్స్ మధ్య ఉన్న ధరల వ్యత్యాసం తొలగిపోతుందని అన్నారు.
హై-వాల్యూ కార్పొరేట్, ఎస్‌ఎమ్‌ఈ రోమింగ్ సెగ్మెంట్లలో కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీకి ఈ ప్లాన్లు దోహదపడతాయన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు. ఇక రూ. 599 ప్లాన్‌లో వినియోగదారులు 1,200 నిమిషాల ఉచిత ఔట్‌గోయింగ్ కాల్స్ (రోమింగ్, ఎస్‌టిడి, లోకల్), ఉచితంగా అపరిమిత నేషనల్ ఇన్‌కమింగ్ రోమింగ్, 2జిబి డేటా, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందుతారు. అంతేగాక ఉచితంగా వచ్చిన 1,200 నిమిషాల టాక్‌టైమ్ అయిపోయిన తర్వాత ఒక్కో కాల్‌కు 30 పైసల చొప్పునే చెల్లించే వెసులుబాటును దక్కించుకుంటారు.

ఇక రూ. 350 ప్లాన్‌లో వినియోగదారులు 700 నిమిషాల ఉచిత ఔట్‌గోయింగ్ కాల్స్ (రోమింగ్, ఎస్‌టిడి, లోక్‌ల్), ఉచితంగా 200 నిమిషాల నేషనల్ ఇన్‌కమింగ్ రోమింగ్, 1జిబి డేటా, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. అలాగే 700 నిమిషాల ఉచిత టాక్‌టైమ్ అయిపోయాక ఒక్కో కాల్‌కు 40 పైసల చొప్పున చెల్లించే సౌకర్యాన్ని పొందుతారు. ప్రీ-పెయిడ్ కస్టమర్ల కోసం తెచ్చిన రూ. 45 ప్యాకేజీతో నెల రోజులపాటు రోమింగ్ సమయంలో ఇన్‌కమింగ్ కాల్స్ ఉచితంగా అందుకునే అవకాశం, ఔట్‌గోయింగ్ కాల్స్‌కు 40 పైసలు చెల్లించాల్సి ఉంటుంది.
సరికొత్త స్థాయికి స్టాక్‌మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లలో రికార్డుల జోరు కొనసాగుతోంది. పార్లమెంట్‌లో నరేంద్ర మోడీ ప్రభుత్వలక్ష్యాలు వెల్లడైన నేపథ్యంలో సోమవారం సరికొత్త స్థాయికి స్టాక్‌మార్కెట్లు చేరుకున్నాయి. అన్ని రంగాల్లో భారీగా కొనుగోళ్లు నమోదవడంతో మదుపర్ల సంపద లక్ష కోట్ల రూపాయలను అధిగమించింది. రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, పవర్, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఆటో రంగాల షేర్లు పెద్ద ఎత్తున లాభాలను అందుకున్నాయి.
ఇంట్రా-డే ట్రేడింగ్‌లో బిఎస్ఈ సూచీ సెన్సెక్స్ 25,644.77 స్థాయిని అందుకోగా, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 7,673.70 మార్కును తాకింది. అయితే ఆ తర్వాత నమోదైన అమ్మకాల ఒత్తిడితో చివరకు సెన్సెక్స్ 183.75 పాయింట్ల లాభంతో 25,580.21 వద్ద, నిఫ్టీ 71.20 పాయింట్ల లాభంతో 7,654.60 వద్ద ముగిశాయి. ఫలితంగా ఆల్‌టైమ్ హైలను అందుకున్నాయి.
కెవైసి నిబంధనలు సరళం
బ్యాంకు ఖాతాలను తెరిచే ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ సరళతరం చేసింది. ఇంతకుముందున్న నో యువర్ కస్టమర్ (కెవైసి) నిబంధనలను సడలించింది. కేవలం శాశ్వత లేదా తాత్కాలిక చిరునామా వివరాలతోనే ఇకపై బ్యాంక్ అకౌంట్‌ను ప్రారంభించే అవకాశాన్ని ఆర్‌బిఐ కల్పించింది. ఆర్‌బిఐ నిర్ణయం వలస కార్మికులకు, ఉద్యోగులకు, తరచూ బదిలీ అయ్యే ఉద్యోగస్తులకు ప్రయోజనం చేకూరనుంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications