జాబ్స్: అగ్రభాగాన ఐసిఐసిఐ, వెనకే హెచ్‌డిఎఫ్‌సి

వీటిలో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంకులున్నాయి. 2013-14లో ఈ ఐదు బ్యాంకుల్లోని ఉద్యోగుల సంఖ్య 20,000లకుపైగా పెరిగింది. కాగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది మార్చి 31 నాటికి 68,165గా ఉండగా, ఐసిఐసిఐ బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య 72,226కు చేరింది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో 69,065 మంది ఉద్యోగులుండగా, ఐసిఐసిఐ బ్యాంక్‌లో 62,065 మంది ఉద్యోగులున్నారు.
ఈ క్రమంలో 2013-14లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉద్యోగుల్లో 900 తగ్గితే, ఐసిఐసిఐ బ్యాంక్ ఉద్యోగులు 10,161 మంది పెరిగారు. గత ఆర్థిక సంవత్సరం ఆదాయం, లాభాల్లోనూ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కంటే ఐసిఐసిఐ బ్యాంక్ పైచేయి సాధించడం గమనార్హం. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏకీకృత ఆదాయం 50,852 కోట్ల రూపాయలుగా, ఏకీకృత నికర లాభం 8,743 కోట్ల రూపాయలుగా నమోదైతే, స్టాండలోన్ ఆధారంగా 49,055 కోట్ల రూపాయల ఆదాయం, 8,478 కోట్ల రూపాయల నికర లాభాన్ని పొందింది.
ఐసిఐసిఐ బ్యాంక్ ఏకీకృత ఆదాయం 79,563 కోట్ల రూపాయలుగా, ఏకీకృత నికర లాభం 11,041 కోట్ల రూపాయలుగా ఉంది. స్టాండలోన్ ఆధారంగా 54,606 కోట్ల రూపాయల ఆదాయం, 9,810 కోట్ల రూపాయల నికర లాభాన్ని అందుకుంది. యాక్సిస్ బ్యాంక్‌లో గత ఆర్థిక సంవత్సరం 4,519 మంది ఉద్యోగులు పెరగడంతో బ్యాంక్‌లో ఉద్యోగుల సంఖ్య 42,420కి చేరింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఉద్యోగులూ 4,088 పెరగడంతో 15,590కి, కొటక్ మహింద్ర బ్యాంక్ ఉద్యోగులు 2,586 పెరిగి 16,086కు చేరారు. యెస్ బ్యాంక్ ఉద్యోగులు సైతం 1,774 మంది పెరగడంతో మొత్తం సంస్థ ఉద్యోగుల సంఖ్య 8,798కి చేరింది.


Click it and Unblock the Notifications