బెంగళూరు-గోవా రూ. 990దే: ఎయిర్‌ఏషియా

 AirAsia offers Rs.990 fare for maiden Bangalore-Goa flight
చెన్నై: దేశీయ విమానయాన రంగంలో మరోసారి ఛార్జీల పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. దేశీయ విమానయాన రంగంలోకి కొత్తగా అడుగుపెడుతున్న చౌక విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా ఎవరూ వూహించని సంచలనాత్మక ఛార్జీలను ప్రకటించింది. బెంగళూరు-గోవా మధ్య జూన్ 12న ఎయిర్ ఏషియా ఇండియా తొలి విమానం ఎగరనుండగా, దీని టిక్కెట్ ధర అన్ని పన్నులతో కలుపుకుని 990 రూపాయలు నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం వివరాలను ఏయిర్ ఏషియా వెల్లడించింది.

ఇంతకుముందు దేశీయ ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థలు స్పైస్‌జెట్, ఇండిగో సంస్థలు కూడా ఈ తరహా ఆఫర్లతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే బెంగళూరు-గోవా మధ్య ఇతర విమానయాన సంస్థలు ప్రయాణీకుల వద్ద ప్రస్తుతం 5,000 రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎయిర్ ఏషియా ప్రకటన ఇతర సంస్థలనూ తమ టిక్కెట్ ధరలను తగ్గించే దిశగా నడిపించేలా ఉంది. ఇదిలావుంటే శుక్రవారం సాయంత్రం నుంచి తమ సంస్థ వెబ్‌సైట్‌లో టిక్కెట్ బుకింగ్స్ మొదలవుతాయని ఎయిర్ ఏషియా ఇండియా ఏషియా మిట్టు చాండిల్యా తెలిపారు.

ప్రతీ భారతీయుడికి విమానంలో ప్రయాణించే అవకాశాన్ని కల్పించడమే తమ లక్ష్యమనిని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అంతకుముందు చాండిల్యా పిటిఐతో మాట్లాడుతూ.. ఇతర విమానయాన సంస్థల ఎయిర్ సర్వీసులతో పోల్చితే తమ సర్వీసుల్లో టిక్కెట్ ధరలు 35 శాతం తక్కువగా ఉంటాయన్నారు. ఇక జూన్ 12 నుంచి దేశీయ విమానయాన సేవలు ప్రారంభిస్తున్న ఎయిర్ ఏషియా ఇండియా.. బెంగళూరు- గోవా మధ్య ఎగిరే తొలి విమానం ఎ320 అని స్పష్టం తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇది బెంగళూరు నుంచి బయలుదేరి, సాయంత్రం 6 గంటలకు గోవా చేరుకుంటుందని చాండిల్యా చెప్పారు.

ఢిల్లీ-ముంబయి మధ్య ఇప్పుడే విమానాలను నడిపించే ఉద్దేశం లేదన్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 10 పట్టణాలను 10 విమానాలతో కనెక్ట్ చేసే దిశగా వెళ్తున్నట్లు చెప్పారు. కాగా, మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా, టాటా సన్స్, అరుణ్ భాటియాకు చెందిన టెలెస్ట్రా ట్రేడ్‌ప్లేస్ సంయుక్తంగా ఏర్పాటు చేసినదే ఈ ఎయిర్ ఆషియా ఇండియా జాయింట్ వెంచర్. ఈ నెల ఆరంభంలో దీనికి దేశీయ విమానయాన నియంత్రిత వ్యవవస్థ డిజిసిఎ విమానయాన సేవలకు సంబంధించిన లైసెన్సును మంజూరు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+