సృజనాత్మకం, వైవిధ్యం: ఇకత్ ఆర్ట్ మేళా(పిక్చర్స్)
హైదరాబాద్: అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో నేత కార్మికులు ప్రత్యేకంగా ఇకత్ ఆర్ట్ విధానంతో నేసిన హ్యాండ్‌లూమ్ ఉత్పత్తుల వస్త్ర ప్రదర్శన ‘పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా-2014' ప్రారంభమైంది. నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబ 12లోని కళింగ కల్చరల్ హోటల్‌లో ఈ ప్రదర్శన కొలువు దీరింది.
ఈ మేళాను ఫ్యాషన్ డిజైనర్లు హిమబిందు, మధువర్మలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ తరహా ఉత్పత్తుల ప్రదర్శనతో చేనేత కార్మికులు తమ ఉత్పత్తులకు మరింత ప్రాచూర్యం కల్పించుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. పరోక్షంగా నేత కార్మికులకు తమ సృజనాత్మకతకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని వారు అన్నారు.
హ్యాండ్‌లూమ్ పార్క్ ఛైర్మన్ దేవేందర్, సిఈఓ దామోదర్‌లు మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో వందలాది రకాల పోచంపల్లి సిల్క్ అండ్ కాటన్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, కుర్తీలు, స్టోల్స్, బెడ్ షీట్స్, హోమ్ లెనిన్ వంటి ఉత్పత్తులు లభిస్తాయని తెలిపారు. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా చక్కటి రంగులలో అందుబాటులో ఉంచామని తెలిపారు.

ఇకత్ ఆర్ట్ మేళా
అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో నేత కార్మికులు ప్రత్యేకంగా ఇకత్ ఆర్ట్ విధానంతో నేసిన హ్యాండ్‌లూమ్ ఉత్పత్తుల వస్త్ర ప్రదర్శన ‘పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా-2014' ప్రారంభమైంది.

ఇకత్ ఆర్ట్ మేళా
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబ 12లోని కళింగ కల్చరల్ హోటల్‌లో ఈ ప్రదర్శన కొలువు దీరింది.

ఇకత్ ఆర్ట్ మేళా
ఈ మేళాను ఫ్యాషన్ డిజైనర్లు హిమబిందు, మధువర్మలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ తరహా ఉత్పత్తుల ప్రదర్శనతో చేనేత కార్మికులు తమ ఉత్పత్తులకు మరింత ప్రాచూర్యం కల్పించుకునే అవకాశం లభిస్తుందని అన్నారు.

ఇకత్ ఆర్ట్ మేళా
ఈ ప్రదర్శన పరోక్షంగా నేత కార్మికులకు తమ సృజనాత్మకతకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని నిర్వాహకులు అన్నారు.

ఇకత్ ఆర్ట్ మేళా
ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా చక్కటి రంగులలో అందుబాటులో ఉంచామని తెలిపారు.


Click it and Unblock the Notifications