న్యూఢిల్లీ: బహుళ బ్రాండ్ల చిల్లర వరక్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ)ను అనుమతించబోమని నూతన వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. భారత రిటైలింగ్‌లోకి విదేశీ సంస్థలు పెద్ద ఎత్తున ప్రవేశిస్తే, మధ్య, సూక్ష్మ తరహా వ్యాపారులు, చిన్న రైతులు దెబ్బతింటారని పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలకు, నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఒక్క బహుళ బ్రాండ్ల చిల్లర వర్తకంలో తప్ప, ఆస్తుల సృష్టికి, ఉద్యోగాల కల్పనకు, ఇన్‌ఫ్రా మెరుగుదలకు, కొత్త టెక్నాలజీల కొనుగోలుకు అవకాశం ఉన్న అన్ని రంగాల్లో ఎఫ్‌డిఐలను అనుమతిస్తామని బిజెపి తన మేనిఫెస్టోలో పేర్కొందని తెలిపారు.
ఎఫ్‌డిఐ పాలసీని క్రమబద్ధీకరిస్తామని సీతారామన్ చెప్పారు. ఎగుమతుల వృద్ధి తమ తొలి ప్రాధాన్యమని సీతారామన్ తెలిపారు. విదేశాలతో ఆర్థిక సంబంధాలు, వాణిజ్య కార్యకలాపాలు పెంచుకోవడానికి కృషి చేస్తామని చెప్పారు. కాగా, యుపిఏ-2 ప్రభుత్వం బహుళ బ్రాండ్ల చిల్లర వర్తకంలో రంగంలో ఎఫ్‌డిఐలను ఆహ్వానించడంతో బ్రిటన్‌కు చెందిన టెస్కో, టాటా గ్రూప్‌నకు చెందిన ట్రెంట్‌తో కలిసి 50:50 జాయింట్ వెంచర్ చేపట్టేందుకు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను మార్చిలో యుపిఎ ప్రభుత్వం ఆమోదించింది.

నిర్మలా సీతారామన్
బహుళ బ్రాండ్ల చిల్లర వరక్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ)ను అనుమతించబోమని నూతన వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

నిర్మలా సీతారామన్
భారత రిటైలింగ్‌లోకి విదేశీ సంస్థలు పెద్ద ఎత్తున ప్రవేశిస్తే, మధ్య, సూక్ష్మ తరహా వ్యాపారులు, చిన్న రైతులు దెబ్బతింటారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

నిర్మలా సీతారామన్
భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలకు, నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని నిర్మలా సీతారామన్ తెలిపారు.

నిర్మలా సీతారామన్
ఒక్క బహుళ బ్రాండ్ల చిల్లర వర్తకంలో తప్ప, ఆస్తుల సృష్టికి, ఉద్యోగాల కల్పనకు, ఇన్‌ఫ్రా మెరుగుదలకు, కొత్త టెక్నాలజీల కొనుగోలుకు అవకాశం ఉన్న అన్ని రంగాల్లో ఎఫ్‌డిఐలను అనుమతిస్తామని బిజెపి తన మేనిఫెస్టోలో పేర్కొందని తెలిపారు.


Click it and Unblock the Notifications