అభివృద్ధికి అద్భుత అవకాశాలు: కెటిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. మంగళవారం కాచిగూడలోని హోటల్ వైష్ణోయ్‌లో జరిగిన ‘తెలంగాణ మొదటి పారిశ్రామిక వేత్తల సమావేశం-2014'కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆ తర్వాత తెలంగాణ బిల్డర్ల సమావేశంలోనూ కెటిఆర్ పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరం అంటే నిన్న మొన్న వచ్చిన నాయకుడెవరో నిర్మించిన నగరం కాదని, నాలుగు వందల సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న నగరమని కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశాను అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పుకొని తిరుగుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో వాతావరణం పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలమైనదని, ఎంతో మంది దశాబ్దాల కృషి ఈ అభివృద్ధికి కారణమని అన్నారు.
దక్షిణ భారత దేశంలోనే హైదరాబాద్ నంబర్ వన్ నగరమని కెటిఆర్ అన్నారు. ఐటిఐఆర్ ప్రాజెక్టు అమలులోకి వచ్చిన తరువాత హైదరాబాద్ ఇప్పుడున్న దాని కన్నా మూడింతలు విస్తరిస్తుందని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉండాలని తాము కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. ఐదేళ్లలో తెలంగాణను దేశం గర్వించే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు.
రాష్ట్రంలో ఒక పార్టీ కేంద్రంలో ఒక పార్టీ ఉండడం వల్ల అభివృద్ధిపై అనుమానాలు అవసరం లేదని కెటిఆర్ తెలిపారు. కేంద్రంలో పదేళ్ల పాటు యుపిఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ అభివృద్ధి సాధించలేదా? అని కెటిఆర్ ప్రశ్నించారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు.

సమావేశంలో కెటిఆర్
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు.

కెటిఆర్ ప్రసంగం
మంగళవారం కాచిగూడలోని హోటల్ వైష్ణోయ్‌లో జరిగిన ‘తెలంగాణ మొదటి పారిశ్రామిక వేత్తల సమావేశం-2014'కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.

హాజరైన పారిశ్రామికవేత్తలు
హైదరాబాద్ నగరం అంటే నిన్న మొన్న వచ్చిన నాయకుడెవరో నిర్మించిన నగరం కాదని, నాలుగు వందల సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న నగరమని కెటిఆర్ తెలిపారు.

తెలంగాణ బిల్డర్ల సమావేశం
మంగళవారం జరిగిన తెలంగాణ బిల్డర్ల సమావేశంలోనూ కల్వకుంట్ల తారక రామారావు పాల్గొని ప్రసంగించారు.

బిల్డర్ల సమావేశంలో..
హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశాను అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పుకొని తిరుగుతున్నారని ఆరోపించారు.

బిల్డర్ల సమావేశంలో..
హైదరాబాద్‌లో వాతావరణం పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలమైనదని, ఎంతో మంది దశాబ్దాల కృషి ఈ అభివృద్ధికి కారణమని అన్నారు.


Click it and Unblock the Notifications