ఎగ్జిట్ పోల్స్ జోష్: పరుగులు తీసిన మార్కెట్లు

ముంబై: భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతోందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లలో మదుపర్ల ఉత్సాహం ఉరకలెత్తింది. మునుపెన్నడూ లేనివిధంగా మంగళవారం ఇంట్రా-డే ట్రేడింగ్‌లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 24,000 స్థాయిని అధిగమించింది. గరిష్ఠంగా 24,068.94 స్థాయిని తాకింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 7,172.35 పాయింట్లను అందుకుని సరికొత్త ఇంట్రా-డే ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసింది.

ఈ దశలో మదుపర్లు కొంత అమ్మకాల ఒత్తిడికి గురవడంతో చివరకు సెన్సెక్స్ 320.23 పాయింట్ల వృద్ధితో 23,871.23 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 94.50 పాయింట్ల పెరుగుదలతో 7,108.75 పాయింట్ల వద్ద నిలిచింది. ఫలితంగా ఈ సూచీలు మరో కొత్త ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పాయి. వ్యాపార, పారిశ్రామిక రంగాలకు పెద్దపీట వేసే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కానుందన్న మదుపర్ల విశ్వాసానికి ఎగ్జిట్ పోల్స్ బలం చేకూర్చాయంటూ నిపుణులు
విశ్లేషించారు.

543 లోక్‌సభ స్థానాల్లో 249 నుంచి 290 సీట్లను ఎన్‌డిఎ కూటమి గెలుచుకుంటుందని సోమవారం రాత్రి వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అంతకుముందు సోమవారం ఉదయం ఇదే ముందస్తు అంచనాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలను అందుకున్న విషయం తెలిసిందే. సెన్సెక్స్ 23,000 స్థాయిని దాటగా, నిఫ్టీ 7,000 స్థాయిని అధిగమించింది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో మంగళవారం కూడా మదుపర్లు భారీగా కొనుగోళ్లు జరిపారు.

 Sensex hits 24,000 points; conquers another historic peak

పవర్, కన్జ్యూమర్ డ్యూరబుల్, రిఫైనరీ, ఐటి, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, టెక్నాలజీ రంగాల షేర్లు మదుపర్లను ఆకట్టుకుని అధిక లాభాలను సొంతం చేసుకున్నాయి. 3.26 శాతం నుంచి 2.23 శాతం పెరిగాయి. బిహెచ్‌ఇఎల్ అత్యధికంగా 10.25 శాతం లాభపడగా, హీరో మోటోకార్ప్, ఒఎన్‌జిసి, టాటా పవర్, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, గెయిల్ ఇండియా, టిసిఎస్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఎస్‌బిఐ, హెచ్‌యుఎల్, ఎన్‌టిపిసి షేర్లు 5.39 శాతం నుంచి 1.28 శాతం మేర పెరిగాయి. డాక్టర్ రెడ్డీస్ మాత్రం 3.99 శాతం క్షీణించింది.

ఇది ఇలా ఉండగా స్టాక్ ఇండెక్స్‌లు కనివిని ఎరుగని రీతిలో దూసుకుపోతూ ఉండడంతో ఇండెక్స్‌ల్లో గాని, షేర్లలో గాని అనుచితమైన ఆటుపోట్లు ఏవి చోటు చేసుకున్నా నిలువరించేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని ఆర్థికమంత్రి చిదంబరం సెబి, ఆర్‌బిఐలకు సూచించారు. చిదంబరం మంగళవారం రెగ్యులేటర్లతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అదే సమయంలో స్టాక్ కదలికలను తాము నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎలాంటి అనూహ్యమైన భారీ ఆటుపోట్లు ఏర్పడినా నిలువరించగల వ్యవస్థలను సిద్ధంగా ఉంచామని సెబి చైర్మన్ యుకె సిన్హా ప్రకటించారు. రానున్న కొద్ది రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా దీటుగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+