For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశీయ మార్కెట్లోకి ఐషర్ కొత్త ట్రక్కులు(పిక్చర్స్)

|

హైదరాబాద్: దేశీయ మార్కెట్లో తన వాటాను గణనీయంగా పెంచుకోవాలన్న ఉద్దేశంతో భారీ ట్రక్కులు, బస్సుల రూపకర్త ఐషర్ మరో రెండు సరికొత్త వాహనాలను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. విఐసివి సరికొత్త ఇషర్ ప్రో 1000, ఐషర్ 3000 సిరీస్‌లను సోమవారం రాష్ట్ర మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ ఐషర్ ప్రో 1000 సిరీస్ 5-14 టన్నుల లైట్, మీడియం వినియోగ విభాగం ట్రక్కులలో ఓ మెరుగైన శ్రేణి అని సంస్థ పేర్కొంది.

క్లాస్ రేటెడ్ పేలోడ్‌లో ప్రత్యేకంగా రూపొందించబడిందని తెలిపింది. తక్కువ నిర్వహణ, ఉత్తమ ఇంధన సామార్థ్యం కలిగినదిగా నిరూపితమైన ఇ-483 ఇంజన్‌ను వాడినట్లు చెప్పింది. ఐషర్ ప్రో 3000 సిరీస్ 9-14 టన్నుల మీడియం డ్యూటీ వినియోగదారుల ట్రక్కు అని తెలిపింది. ఈ శ్రేణి అత్యధిక శక్తి, టార్క్‌తో ఆడంబరంగా ఉండేలా ప్రీమియం సెగ్మెంట్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిందని వివరించింది. అలాగే తక్కువ నిర్వహణ కోసం 4 సిలిండర్ 4 వాల్వ్ ఇ-494 సిఆర్‌ఎస్ హై టెక్నాలజీ ఇంజన్ కలిగి వోల్వో గ్రూప్ ఇంజన్ మేనేజ్‌మెంట్ సిస్టం 3.0తో తయారు చేసింది.

ఈ సందర్భంగా విఇ కమర్షియల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (వెహికిల్స్ సేల్స్, మార్కెటింగ్) శ్యామ్ మాలర్ మాట్లాడుతూ.. వచ్చే కొన్ని నెలల్లోనే సరికొత్త మీడియం, హెవీ ట్రక్కులతోపాటు బస్సులను మార్కెట్లోకి తెస్తామన్నారు. నెలకో కొత్త మోడల్‌ను తీసుకురావాలన్న వ్యూహంతో పని చేస్తున్నామని తెలిపారు. కొత్తగా ఐషర్ ప్రో 1000, 3,000, 6000, 8000 సీరిస్‌లో 5 టన్నుల నుంచి 49 టన్నుల వరకు సామర్థ్యం కలిగిన వాణిజ్య వాహనాలు, బస్సులను తెస్తామని చెప్పారు.

త్వరలోనే 9.5 టన్నుల సామర్థ్యం ఉన్న ట్రక్కును, వచ్చే నెలలో మరో ట్రక్కు, రెండు నెలల్లో స్కైలైన్ ప్రోసీరిస్ బస్సులను విడుదల చేస్తామని పేర్కొన్నారు. మరిన్ని మోడళ్ల ద్వారా ఏడాదిలో కంపెనీ మార్కెట్ వాటా 13.8 శాతం నుంచి 15 శాతానికి పెరిగే అవకాశం ఉందని చెప్పారు. కాగా, నిరుడు ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ ట్రక్కింగ్' ద్వారా కొత్త తరహా ఐషర్ ప్రో సిరీస్ ట్రక్కులు, బస్సులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

వివరాలు వెల్లఢిస్తూ..

వివరాలు వెల్లఢిస్తూ..

దేశీయ మార్కెట్లో తన వాటాను గణనీయంగా పెంచుకోవాలన్న ఉద్దేశంతో భారీ ట్రక్కులు, బస్సుల రూపకర్త ఐషర్ మరో రెండు సరికొత్త వాహనాలను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.

కొత్త ట్రక్కులతో..

కొత్త ట్రక్కులతో..

విఐసివి సరికొత్త ఇషర్ ప్రో 1000, ఐషర్ 3000 సిరీస్‌లను సోమవారం రాష్ట్ర మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ ఐషర్ ప్రో 1000 సిరీస్ 5-14 టన్నుల లైట్, మీడియం వినియోగ విభాగం ట్రక్కులలో ఓ మెరుగైన శ్రేణి అని సంస్థ పేర్కొంది.

కొత్త ట్రక్కులతో..

కొత్త ట్రక్కులతో..

ఈ ఐషర్ ప్రో 1000 సిరీస్ 5-14 టన్నుల లైట్, మీడియం వినియోగ విభాగం ట్రక్కులలో ఓ మెరుగైన శ్రేణి అని ఐషర్ సంస్థ పేర్కొంది.

కొత్త ట్రక్కులతో..

కొత్త ట్రక్కులతో..

క్లాస్ రేటెడ్ పేలోడ్‌లో ప్రత్యేకంగా రూపొందించబడిందని తెలిపింది. తక్కువ నిర్వహణ, ఉత్తమ ఇంధన సామార్థ్యం కలిగినదిగా నిరూపితమైన ఇ-483 ఇంజన్‌ను వాడినట్లు చెప్పింది. ఐషర్ ప్రో 3000 సిరీస్ 9-14 టన్నుల మీడియం డ్యూటీ వినియోగదారుల ట్రక్కు అని తెలిపింది.

కొత్త ట్రక్కుతో..

కొత్త ట్రక్కుతో..

ఈ సందర్భంగా విఇ కమర్షియల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (వెహికిల్స్ సేల్స్, మార్కెటింగ్) శ్యామ్ మాలర్ మాట్లాడుతూ.. వచ్చే కొన్ని నెలల్లోనే సరికొత్త మీడియం, హెవీ ట్రక్కులతోపాటు బస్సులను మార్కెట్లోకి తెస్తామన్నారు.

English summary

దేశీయ మార్కెట్లోకి ఐషర్ కొత్త ట్రక్కులు(పిక్చర్స్) | New government to spur demand for trucks: Eicher

VE Commercial Vehicles Ltd, the 50:50 joint venture between the Volvo Group and Eicher Motors Ltd, expects a pick-up in demand for heavy duty and medium duty trucks in the second half of this calendar year after a new Union government assumes office.
Story first published: Tuesday, May 13, 2014, 11:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X