న్యూఢిల్లీ: దేశీయ ఔషధరంగ సంస్థ సిప్లా లిమిటెడ్ అమెరికాకు చెందిన చేస్ ఫార్మాసూటికల్స్‌లో 14.6 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు 1.5 మిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్లు సోమవారం సిప్లా వెల్లడించింది. ఈ మేరకు ఓ ఒప్పందం కూడా కుదిరినట్లు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు స్పష్టం చేసింది. బ్రిటన్‌లోని సిప్లా అనుబంధ సంస్థ సిప్లా (ఈయూ) లిమిటెడ్ ద్వారా ఈ లావాదేవీలు జరుగుతాయని పేర్కొంది.
అల్జీమర్ వ్యాధికి మెరుగైన చికిత్సను అందించే ఔషధాల రూపకల్పనకు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా సిప్లా తెలిపింది. ఇందులోభాగంగానే అదనంగా మరో 4.5 మిలియన్ డాలర్ల పెట్టుబడులను చేస్ ఫార్మాసూటికల్స్‌లో పెడుతున్నట్లు సిప్లా పేర్కొంది. పరిశోధనలు విజయవంతమైతే సిప్లా ముందంజలో ఉన్న భారత్, దక్షిణాఫ్రికా మార్కెట్లలో తక్కువ ధరకే మందు లభిస్తుందని సిప్లా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్ సిఈఓ సుభాను సక్సేనా తెలిపారు.

ఎంసిఎక్స్-ఎస్ఎక్స్ కేసులో భావేను ప్రశ్నించిన సిబిఐ
ఎఫ్‌టిఐఎల్, ఎంసిఎక్స్-ఎస్ఎక్స్ కేసులో ప్రిలిమినరీ ఎంక్వైరీ నమోదు చేసిన రెండు నెలల తర్వాత స్టాక్ ఎక్స్ఛేంజ్ బోర్డ ఆఫ్ ఇండియా(సెబి) మాజీ ఛైర్మన్ సిబి భావేను సిబిఐ సోమవారం ప్రశ్నించింది. జిగ్నేష్ షా యాజమాన్యంలోని ఫైనాన్షియల్ టెక్నాలజీస్ (ఎఫ్‌టిఐఎల్), ఎంసిఎక్స్‌ల ఉమ్మడి యాజమాన్యంలో ఎంసిఎక్స్-ఎస్ఎక్స్‌ను పూర్తి స్థాయి ఎక్స్ఛేంజిగా పని చేయడానికి ఏ విధంగా అనుమతి ఇచ్చారు, అందుకు ఆయన పరిగణనలోకి తీసుకున్న అంశాలేమిటి అన్న విషయాలపై ఆయనను సిబిఐ ప్రశ్నించినట్టు తెలిసింది.
ఏదో ఒక సంఘటన కాకుండా 2013 వరకు ఆ వ్యవహారంలో ఏమేమి జరిగిందన్నది సిబిఐ పరిశీలిస్తుందని తాను భావిస్తున్నట్టు సిబిఐ దర్యాప్తులో పాల్గొన్న అనంతరం భావే అన్నారు. సిబిఐ తనను బెంగళూరులో ప్రశ్నించిన అనంతరం ఆయన స్పందిస్తూ తాను, సెబి మాజీ సభ్యుడు అబ్రహాం సభ్యులుగా ఉన్న సమయంలో మాత్రమే ఇదంతా జరిగిందన్న భావం కలిగేలా సిబిఐ ప్రిలిమినరీ ఎంక్వైరీ ఉందని ఆయన అన్నారు. తనను ప్రశ్నించిన సిబిఐ బృందం తాను సెబి చైర్మన్‌గా ఉన్న కాలంలో జరిగిన అంశాలకే తమ ప్రశ్నలను పరిమితం చేశారని భావే చెప్పారు. కానీ ఆ తర్వాత జరిగిన విషయాలను కూడా తాము పరిగణనలోకి తీసుకుంటామని సిబిఐ అధికారులు చెప్పారని తెలిపారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications